Cricket in Olympics: Cricket Approved by
IOC for 2028 Los Angeles Olympics
ఒలింపిక్స్‌లో క్రికెట్: 2028 లాస్
ఏంజెల్స్ ఒలింపిక్స్ క్రికెట్ ఆట ను చేర్చుటకు IOC ఆమోదం
======================
ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూసే అవకాశం దక్కింది. అయితే, వచ్చే ఏడాది (పారిస్) ఒలింపిక్స్ లో కాకుండా.. లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న
2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ
నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా క్రీడల్లో క్రికెట్ విజయవంతం కావడం.. చాలా ఏళ్లుగా
మెగా ఈవెంట్లోనూ ఈ క్రీడను చేర్చాలనే డిమాండ్ల నేపథ్యంలో ఐవోసీ కమిటీ (IOC) తాజాగా దీనికి ఆమోద ముద్ర వేసింది.
ఐవోసీ ఆమోద ముద్ర వేసిన నిర్ణయాలను ఒలింపిక్ ప్రోగ్రామ్
కమిషన్ (OPC) సమీక్షించి ఓటింగ్ ద్వారా అధికారికంగా క్రికెట్
ఒలింపిక్స్ లో చేరిపోతుంది. ఇప్పటికే వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి బహుళ దేశాల టోర్నీలను వీక్షించే అభిమానులకు ఒలింపిక్స్
రూపంలో మరో మెగా సంబరం ఆస్వాదించే అవకాశం కలిగినట్టే. అయితే టీ20 ఫార్మాట్లో మ్యాచ్ లు జరుగుతాయి. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ తో పాటు
బేస్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోసీ, స్క్వాష్ క్రీడలకు కూడా చోటు కల్పించేందుకు అమోదం తెలిపినట్లు ఐవోసీ ట్వీట్
చేసింది.
======================
Baseball/softball, cricket (T20), flag football, lacrosse (sixes) and squash are the five sports submitted by the IOC’s Executive Board to the upcoming IOC Session as additional sports for the Olympic Games Los Angeles 2028. Full release: https://t.co/c97kn8hi6H
— IOC MEDIA (@iocmedia) October 13, 2023
0 Komentar