Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Disney+ Hotstar & ICC Men’s Cricket WC 2023: Hotstar Free Live & Adds MaxView Video Streaming

 

Disney+ Hotstar & ICC Men’s Cricket WC 2023: Hotstar Free Live & Adds MaxView Video Streaming

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ లో 2023 క్రికెట్ ప్రపంచకప్ ఉచితం & కొత్త ఫీచర్ ‘మ్యాక్స్‌వ్యూ‘ వీడియో స్ట్రీమింగ్‌

=======================

భారత దేశం లో జరగనున్న క్రికెట్ ప్రపంచకప్ 2023 గురించి డిస్నీ+ హాట్ స్టార్ అభిమానులకు శుభ వార్త చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్ లను మొబైల్ యాప్ లో ఉచితం గా (FREE) తిలకించేందుకు అవకాశం కల్పిస్తున్న ఈ సంస్థ.. తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. వీక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ లను అప్డేట్ చేసింది.

డిస్నీ+ హాట్ స్టార్ కొత్తగా మొబైల్ వెర్షన్ లో  మ్యాక్స్ వ్యూ (MaxView) ఫీచర్ ను  తీసుకొచ్చింది. ఐసీసీతో కలిసి ఈ సదుపాయాన్ని అందిస్తోంది. దీని ద్వారా వర్టికల్ మోడ్ లో (నిలువుగా; 9x14) క్రికెట్ ను వీక్షించొచ్చు. ఒంటి చేత్తో క్రికెట్ ప్రసారాలను ఆనందించొచ్చు. ఈ మోడ్ లో లైవ్ ఫీడ్ ట్యాబ్, స్కోర్ కార్డు ట్యాబ్ కూడా కనిపిస్తాయి. దీంతో పాటు యూజర్ తనకు నచ్చిన ప్లేయర్ ను మ్యాక్స్ వ్యూ మోడ్ లో  వీక్షించొచ్చు. సిట్ వ్యూలోనూ చూడొచ్చు.

హైక్వాలిటీలో మ్యాచ్ లు వీక్షించినప్పటికీ తక్కువ డేటా ఖర్చయ్యే విధంగా తమ యాప్ ను  అప్డేట్ చేసినట్లు డిస్నీ+ హాట్ స్టార్ పేర్కొంది. క్రికెట్ వీక్షణను మరింత చక్కటి అనుభూతిని అందించేందుకు ఏఐ ఆధారిత ఫిల్టర్లను వినియోగించినట్లు తెలిపింది. క్రికెట్ స్కోర్ కార్డుతో కూడిన పిల్ యాప్లో నిత్యం దర్శనమిస్తూ ఉంటుంది. ఒకవేళ ఓటీటీలో ఇతర కంటెంట్ చూస్తున్నప్పటికీ.. మ్యాచ్ వివరాలను దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

డిస్నీ+హట్ స్టార్ కొత్తగా ‘కమింగ్ సూన్’ ట్రే తీసుకొచ్చారు. అందులో రానున్న కంటెట్ కనిపిస్తుంది. దాంట్లో నచ్చిన వాటికి రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ కంటెంట్ ను, పెయిడ్ కంటెంట్ ను వేర్వేరుగా ఇకపై యాప్ చూపిస్తుంది. యాప్ ఫ్రీ బ్యాడ్జ్ కలిగిన ఇతర కంటెంట్ ను యూజర్లు ఫ్రీ వీక్షించొచ్చు. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లు మొబైల్ యాప్లో మాత్రమే ప్రీగా లభిస్తాయి. కంప్యూటర్, ల్యాప్టా్యూప్లు, ట్యాబ్ ల్లో వీక్షించాలంటే మాత్రం డిస్నీ+హాటర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం డిస్నీ+ హాట్ స్టార్ యాడ్స్ కూడిన వార్షిక ప్లాన్ ధర రూ.899 కాగా.. యాడ్ ప్రీ ప్లాన్ ధర రూ.1499గా లభిస్తోంది. మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.499కి లభిస్తోంది.

=======================

ANDROID MOBILE APP

APPLE APP

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags