Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2023: This Year the Nobel Prize in Chemistry Awarded to These 3 Scientists

 

The Nobel Prize 2023: This Year the Nobel Prize in Chemistry Awarded to These 3 Scientists

ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

=======================

2023 నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. రసాయన శాస్త్రం లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్.. ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు. నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో వీరు చేసిన పరిశోధనలకు గానూ ఈ అవార్డును అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది.

క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష్మమైన నానోపార్టికల్స్. వీటి ఆవిష్కరణ, అభివృద్ధిలో ఈ ముగ్గురు విస్తృత పరిశోధనలు చేశారు. నానోటెక్నాలజీలోని ఈ క్వాంటమ్ డాట్స్  ఇప్పుడు టీవీల నుంచి ఎల్ఈడీ లైట్ల వరకు ఎన్నో పరికరాల్లో వినియోగిస్తున్నాం. వైద్యులు కూడా ట్యూమర్ కణాలను తొలగించేందుకు ఈ సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు" అని రాయల్ స్వీడిష్ అకాడమీ తమ ప్రకటనలో పేర్కొంది.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags