The Nobel Prize 2023: Katalin Karikó & Drew Weissman Wins Nobel Prize in Medicine for
their Work in Covid (mRNA) Vaccines
నోబెల్
ప్రైజ్ 2023:
కోవిడ్ (mRNA) వ్యాక్సిన్‌లలో
చేసిన కృషికి గాను కటాలిన్ కారికో & డ్రూ వీస్‌మాన్ కు ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి
=====================
2023 నోబెల్ బహుమతుల
ప్రకటన ప్రారంభమైంది. వైద్య శాస్త్రం లో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్-2023 వరించింది. కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ
(mRNA) వ్యాక్సిన్ల అభివృద్ధిలో
న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ వీరికి ఈ
అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్ లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా
ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. గతేడాది మానవ పరిణామక్రమంతో
పాటు అంతరించిపోయిన హోమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ స్వాంటె పాబో
ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
వైద్యవిభాగంతో
మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం
రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను
వెల్లడిస్తారు.
నోబెల్
పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది
గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు
అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్
క్రోనర్లకు పెంచారు. స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం
తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.
స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా
ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న
సంగతి తెలిసిందే. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్
మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ
అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
=====================
Congrats to #NobelPrize Laureates Dr. Katalin Karikó and Dr. Drew Weissman, awarded the 2023 @NobelPrize in Physiology or Medicine for their work which led to the development of the #mRNA COVID vaccines. @kkariko @WeissmanLab
— Penn Medicine (@PennMedicine) October 2, 2023
Learn more: https://t.co/oXlxRHPrye pic.twitter.com/FTLrPevR7M
0 Komentar