Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Nobel Prize 2023: This Year the Nobel Prize in Physics Awarded to These 3 Scientists

 

The Nobel Prize 2023: This Year the Nobel Prize in Physics Awarded to These 3 Scientists

ఈ ఏడాది భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

======================

2023 నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. భౌతిక శాస్త్రం లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్ కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్ కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు.

అణువుల్లో (Atoms) ఎలక్ట్రాన్ డైనమిక్స్ ను అధ్యయనం చేసేందుకు.. కాంతి తరంగాల ఆటో సెకండ్ పల్స్ ను  ఉత్పత్తి చేసే పరిశోధనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్ ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని పేర్కొంది.

ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైంది. నిన్న వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్ఎస్ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్మన్ల ను ఈ అవార్డు వరించింది. ఇక, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags