Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Appointment of Pay Revision Committee for the State Govt Employees - Interim Relief 5 % Sanctioned – G.Os Released

 

TS: Appointment of Pay Revision Committee for the State Govt Employees - Interim Relief 5 % Sanctioned – G.Os Released

టీఎస్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) - 5% మధ్యంతర భృతి (ఐఆర్) ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

======================

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిటీ (పీఆర్సీ)ని నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత పీఆర్సీ అమలు గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. జులై ఒకటి నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 5% మధ్యంతర భృతి (ఐఆర్)ని ఈ నెల ఒకటి నుంచి ఇవ్వాలని ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. పీఆర్సీ ఛైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ ను , సభ్యుడిగా బి. రామయ్యను నియమించింది. ఆరు నెలల్లోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఈ కమిటీకి సూచించింది. రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రస్తుత, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని వేతన సవరణపై సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. ఈ కమిటీకి సిబ్బందిని, నిధులను కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

ఐఆర్...

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రభుత్వం నుంచి నిధులు గ్రాంటుగా పొందే సంస్థల్లో పని చేసే వారు, వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులకే ఈ నెల నుంచి ఐఆర్ ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసుల్లో పని చేసే వారికి, ఆల్ ఇండియా సర్వీసుల వారికి, యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఏఆర్, కేంద్ర వేతనాలు పొందేవారికి, కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీలు, స్వతంత్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వారికి ఐఆర్ ఇవ్వకూడదని స్పష్టంచేసింది. ఉద్యోగి మూలవేతనంలో ఐఆర్ ఇచ్చే సమయంలో పెంపు సొమ్ములో 50 పైసలు ఉన్నట్లయితే దాన్ని తర్వాతి రూపాయికి పెంచి ఇవ్వాలి. 50 పైసలలోపు వస్తే దాన్ని తగ్గించి ఇవ్వాలి. ఉదాహరణకు ఎవరైనా ఒక ఉద్యోగికి 5% ఐఆర్ కింద రూ.1565.56 వస్తే ఆయనకు రూ.1566 ఇవ్వాలి. ఒకవేళ 1565.49 వస్తే 49 పైసలు తొలగించి రూ.1565 మాత్రమే ఇవ్వాలని ఆర్థికశాఖ సూచించింది. ఉద్యోగి వేతనంలో డీఏ, ఇంటి అద్దె భత్యం, ఇతర అలవెన్సులు వంటివాటిపై ఐఆర్ లెక్కించరాదు. కేవలం మూల వేతనంపైనే 5% అదనంగా ఇవ్వాలని స్పష్టంచేసింది.

======================

Public Services - Interim Relief Pending Revision of Scales of Pay - Sanctioned – Orders - Issued.

FINANCE (HRM.IV) DEPARTMENT

G.O.Ms.No.133 Dated: 2nd October, 2023.

DOWNLOAD G.O.133

====================== 

Appointment of Pay Revision Committee for the State Government Employees – Orders – Issued.

GENERAL ADMINISTRATION (SPECIAL-A) DEPARTMENT

G.O.Ms.No.159 Dated:02.10.2023.

DOWNLOAD G.O.159

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags