AFCAT - 2024 (01/2024) – All the Details
Here
ఎయిర్ ఫోర్స్
కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 01/ 2024 - పూర్తి వివరాలు ఇవే
===================
ఎయిర్ఫోర్స్
కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్) లో విజయం సాధించి, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపిస్తే శిక్షణ అనంతరం ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. సాధారణ
డిగ్రీ/ బీటెక్ పూర్తయినవారు, ఆఖరు సంవత్సరం
కోర్సులు చదువుతున్నవారు వీటికి పోటీ పడవచ్చు. మహిళలకూ అవకాశం ఉంది. తాజాగా ఏఎఫ్
క్యాట్ - 01/2024 ప్రకటన విడుదలైంది.
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) 01/ 2024, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
1. ఫ్లయింగ్: 38 (పురుషులు- 28,
మహిళలు- 10)
2. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్): 165 (పురుషులు- 149, మహిళలు- 16)
3. గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్): 114 (పురుషులు-98, మహిళలు- 16)
మొత్తం ఖాళీల
సంఖ్య: 317.
అర్హతలు:
ఇంటర్ (ఫిజిక్స్, మ్యాథ్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో నిర్దిష్ట
శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఫ్లయింగ్ బ్రాంచ్క 20-24 ఏళ్లు. గ్రౌండ్
డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచు 20- 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్:
ఫ్లయింగ్ ఆఫీసర్కు రూ.56,100 - రూ. 1,77,500.
ఎంపిక
విధానం: పోస్టును అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్టేజ్ -1, స్టేజ్ -2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్ పైలట్
సెలక్షన్ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు
ఎంపికచేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తులకు ప్రారంభం: 01-12-2023.
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 30-12-2023.
===================
===================
0 Komentar