Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Universities Recruitment 2023: Apply for 3220 Professor, Assistant Professor & Associate Professor Posts in AP Universities – Details Here

 

AP Universities Recruitment 2023: Apply for 3220 Professor, Assistant Professor & Associate Professor Posts in AP Universities – Details Here

ఏపీ వర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తు వివరాలు ఇవే

========================

ఏపీ విశ్వవిద్యాలయాల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్ లాగ్, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు వేటికవే ప్రకటనలు విడుదల చేశాయి.

వీటిలో 278 బ్యాక్ లాగ్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు 415, అసోసియేట్ ప్రొఫెసర్లు 654, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1631, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులు 220 ఉన్నాయి. దరఖాస్తుల సమర్పణకు నవంబరు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది.

ప్రొఫెసర్ పోస్టులు: 415

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 654

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 1631

బ్యాక్ లాగ్ పోస్టులు: 278

లెక్చరర్ పోస్టులు: 220

నాన్ టీచింగ్ పోస్టులు: 22

మొత్తం పోస్టులు: 3220  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్/ పీహెచ్ డీ, యూజీసీ/ సీఎస్ఐఆర్ నెట్/ ఏపీ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా. స్క్రీనింగ్ పరీక్ష: స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్లైన్లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వర్సిటీల్లో ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది

దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2 వేలు, ప్రవాస భారతీయులైతే 50 డాలర్లు/రూ.4.200 ఆన్లైన్ దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా రుసుము చెల్లించాలి. ఇక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.3 వేలు, ప్రవాస భారతీయులైతే ప్రొఫెసర్ పోస్టుకు రూ.150 డాలర్లు/ రూ.12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 100 డాలర్లు/ రూ.8,400 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ: 20/11/2023.

పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ, ఇతర ధ్రువపత్రాల సమర్పణ గడువు: 27/11/2023

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్కు అర్హులు, అనర్హుల ప్రాథమిక జాబితా ప్రదర్శన: 30/11/2023.

అభ్యంతరాల స్వీకరణ: 07.12.2023.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08/12/2023.

========================

NOTIFICATIONS

IMPORTANT DATES

ALL UNIVERSITIES WEBSITE LINKS

RECRUITMENT WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags