Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ayyan Mobile App – Useful for Ayyappa Pilgrims

 

Ayyan Mobile App Useful for Ayyappa Pilgrims

అయ్యన్ మొబైల్ యాప్ - అయ్యప్ప యాత్రికులకు ఉపయోగకరమైన యాప్

======================

కేరళ అటవీ & వన్యప్రాణుల విభాగం ద్వారా నిర్వహించబడుతున్న అయ్యన్ యాప్‌ శబరిమలకు ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు తోడుగా ఉంటుంది. మండల దీక్ష పూర్తి కాగానే భక్తులు ఎంతో శ్రమపడి శబరిమల ఆలయాన్ని చేరుకుంటారు. ఈ మధ్యలో దాదాపు యాభై కిలోమీటర్లు అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. వన్యప్రాణులు సంచరించే ఆ బాటలో భక్తులకు అత్యవసర సేవలు అందించడానికి అటవీశాఖ 'అయ్యన్' యాప్ ను రూపొందించింది.

ఆ మార్గంలో సేవా కేంద్రాలూ, హెల్త్ ఎమర్జెన్సీ, బస, ఏనుగు స్క్వాడ్, ఫైర్ ఫోర్స్, పోలీస్ ఎయిడ్ పోస్ట్, తాగునీటి పాయింట్లతోపాటు ఇంకెన్నో సేవలకోసం అధికారుల్ని సంప్రదించొచ్చు. భక్తులకోసం ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ సేవలు అందించే ఈ యాప్ తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దట్టమైన అడవిలో నడిచి వచ్చే భక్తులకు వన్యప్రాణుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని కేరళ అటవీశాఖ అధికారులు ఈ యాప్ ను రూపొందించింది.

అటవీ మార్గంలో నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగులు లాంటి వన్యమృగాలు దాడిచేసినట్లయితే.. ఈ యాప్ ఉపయోగించి.. వెంటనే అధికారులు సాయం పొందొచ్చని కేరళ అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆపద ఎదురైన స్థలాన్ని గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్ ను రూపొందించారు. గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

======================

About this app:

Welcome to Ayyan App, your trusted guide to the sacred Sabarimala temple. Managed by the Kerala Forests & Wildlife Department, this app is your companion on the spiritual journey to Sabarimala. Seamlessly navigate the path to divinity and experience a pilgrimage like never before.

The app provides information on all aspects of the pilgrimage, including the services available at Pampa and Sannidhanam and along the Swami Ayyappan Road, Pampa-Neelimala-Sannidhanam, Erumeli- Azhutakadav-Pampa and Satram-Uppupara-Sannidhanam routes.

It also provides information about the service centers along the traditional forest routes, medical emergency units, accommodation, elephant squad teams, public toilets, distance from each base to Sannidhanam, free drinking water distribution points, etc. The etiquette and general guidelines that the devotees are required to follow during the pilgrimage are included in the app. 

The ‘Ayyan’ app, is available in six languages: English, Malayalam, Tamil, Kannada, Telugu, and Hindi.

The app, which will be functional in both online and offline modes, also includes emergency helpline numbers and warnings on selected routes.

The app has been developed with the technical support of Leopard Tech Labs Private Limited www.leopardtechlabs.com

======================

DOWNLOAD AYYAN APP

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags