CTET – Central Teacher Eligibility Test
- January 2024: All the Details Here
సెంట్రల్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి 2024: పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 15-02-2024
CTET - January 2024: పరీక్ష ఫలితాలు విడుదల
======================
UPDATE
08-02-2024
CTET -
January 2024: పరీక్ష ‘కీ’ విడుదల
======================
UPDATE 18-01-2024
అడ్మిట్ కార్డులు
విడుదల
పరీక్ష తేదీ:
21/01/2024
======================
UPDATE 12-01-2024
ప్రీ-అడ్మిట్
కార్డ్ విడుదల (పరీక్ష కేంద్రం సిటీ వివరాలు విడుదల)
========================
ఉపాధ్యాయ
వృత్తిని కెరీర్ గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ
టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్
సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది
రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి -2024 సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 18వ ఎడిషన్ సీటెట్ రిజిస్టేషన్లు నవంబర్ 3 నుంచి ప్రారంభం అయ్యాయి. పరీక్షను
కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు.
సెంట్రల్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి - 2024
పరీక్ష
విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు
తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్
ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్
స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం
పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు:
పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక
విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై
ఉండాలి.
పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక
విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు
రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/
దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-11-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 23-11-2023. 27-11-2023, 01-12-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 21-01-2024
========================
========================
0 Komentar