JioMotive: Jio Launches New Device to Make
Your Car ‘SMART’ – Details Here
జియో నుండి కొత్త
పరికరం విడుదల - జియో మోటివ్ తో కారు మరింత స్మార్ట్ – ధర మరియు ఫీచర్ల వివరాలు ఇవే
======================
డ్రైవరు కి ఫోన్
చేయకుండా కారు కండిషన్ తెలిస్తే ఎంత బాగుంటుందో కదా..? ఈ సదుపాయాన్ని డ్రైవర్ తో పాటు యజమానికి కల్పించటం కోసం
జియో కొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. దీని పేరు జియో మోటివ్. కారులో ఏవైనా లోపాలు గుర్తిస్తే అలర్ట్ చేస్తుంది. ఈ-సిమ్
కార్డ్ తో ఇది పనిచేస్తుంది. వై-ఫై హాట్స్పాట్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు
ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవర్, యజమాని ఇద్దరూ ఈ జియో మోటివ్ ద్వారా నోటిఫికేషన్ పొందొచ్చు.
జియో థింగ్స్ యాప్ సాయంతో దీన్ని వినియోగించుకోవచ్చు. కారు భద్రతను పెంచే ఈ
స్మార్ట్ పరికరం ధర రూ.4,999గా జియో
నిర్ణయించింది. మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి సులువుగా నోటిఫికేషన్ పొందొచ్చు.
జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు
చేయొచ్చు.
జియో మోటివ్
డివైజ్ ను కారులోని ఓబీడీ పోర్ట్ కి కనెక్ట్ చేస్తే చాలు.. కారుకు సంబంధించిన
సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్ కు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఇక
ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే.. జియో మోటివ్ తో మీ కారు మరింత స్మార్ట్ గా
మారుతుంది. ఈ పరికరం కారు లొకేషన్ ను ఎల్లప్పుడూ ట్రాక్ చేస్తుంటుంది. కారు హెల్త్
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ టెంపరేచర్ ని ట్రాక్ చేస్తుంది. డ్రైవింగ్ ఆధారంగా
సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఓవర్ స్పీడ్, హార్ష్ బ్రేకింగ్ వంటి సందర్భాల్లో డ్రైవర్ ని హెచ్చరిస్తుంది.
యాంటీ థెఫ్ట్ నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్ సదుపాయం ఉంది.
======================
======================
0 Komentar