SBIF Asha Scholarship Program 2023 –
Details Here
ఎస్బీఐ ఆశా
స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2023 – పూర్తి వివరాలు ఇవే
=====================
ప్రతిభ కలిగి
ఆర్థిక ఇబ్బందులున్న విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్కాలర్
షిప్ అందిస్తోంది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్ పేరుతో ఆర్థిక
సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 స్కాలర్ షిప్ గా అందిస్తారు.
ఎస్బీఐ ఆశా
స్కాలర్ షిప్ ప్రోగ్రామ్-2023
అర్హతలు: ఆరు
నుంచి పన్నెండు తరగతులు చదువుతున్న విద్యార్థులై ఉండాలి. గడిచిన అకడమిక్
పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులతో
ఉత్తీర్ణులూ ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.
దరఖాస్తుకు
అవసరమైన పత్రాలు: గతేడాది అకడమిక్ విద్యార్థి పరీక్షల మార్కుల పత్రం, ప్రభుత్వం గుర్తింపు కార్డు, ప్రస్తుత ఏడాది ప్రవేశాల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా
వివరాలు,
ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్థి
ఫొటో.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్
దరఖాస్తులకు చివరితేది: 15-12-2023.
=====================
=====================
0 Komentar