Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2023: Apply for 26146 GD Constable Posts – Details Here

 

SSC Recruitment 2023: Apply for 26146 GD Constable Posts – Details Here

కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్ / రైఫిల్మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు - జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.

======================

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో 26,146 కానిస్టేబుల్ /  రైఫిల్మ్యన్ పోస్టులు భర్తీ కానున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్ఓ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్మ్యన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీకి ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తోంది.

కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) /  రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ): 26,146 పోస్టులు

1. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్): 6,174 పోస్టులు (పురుషులు- 5211; మహిళలు - 963)

2. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్): 11,025 పోస్టులు (పురుషులు - 9,913; మహిళలు- 1,112)

3. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్): 3,337 పోస్టులు (పురుషులు- 3,266; మహిళలు- 71)

4. సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ): 635 పోస్టులు (పురుషులు- 593; మహిళలు- 42)

5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ): 3,189 పోస్టులు (పురుషులు- 2,694; మహిళలు - 495)

6. అస్సాం రైఫిల్స్(ఏఆర్) 1,490 పోస్టులు (పురుషులు- 1,448; మహిళలు- 42)

7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్ఎస్ఎఫ్): 296 పోస్టులు (పురుషులు - 222; మహిళలు- 74)

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు.

వయోపరిమితి: జనవరి 01, 2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02-01-2001 కంటే ముందు, 01-01-2006 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: రూ .21,700-రూ.69,100 మధ్య చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100(మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 24-11-2023

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-12-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: ఫిబ్రవరి - మార్చి 2024.

======================

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags