CAT-2023: All the
Details
కామన్
అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 – పూర్తి వివరాలు ఇవే
====================
CAT-2023: కామన్ అడ్మిషన్ టెస్ట్ - ఫలితాలు విడుదల
ఇండియన్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు
అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023 ఫలితాలు విడుదలయ్యాయి.
అభ్యర్థులు
యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో స్కోర్ కార్డు
డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్యాట్ లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు
ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ
కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 నగరాల్లో నవంబర్ 26న పరీక్ష
నిర్వహించిన విషయం తెలిసిందే.
తెలుగు
విద్యార్థుల ప్రతిభ
క్యాట్
ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. మొత్తంగా 14 మంది 100 పర్సంటైల్ తో మెరిశారు.
ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరు
ఉన్నారు.
మొత్తంగా 72మంది టాపర్లుగా నిలవగా.. 14మంది విద్యార్థులకు 100 పర్సంటైల్; 29 మందికి 99.99 పర్సంటైల్; 29 మందికి 99.98 పర్సంటైల్
సాధించారు. 100పర్సంటైల్ సాధించిన వారిలో మహారాష్ట్ర
నుంచి అత్యధికంగా నలుగురు ఉండగా.. దిల్లీ, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, కేరళ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
====================
====================
0 Komentar