COVID-19: Fresh Cases,
Active Cases & JN.1 Cases Details – Date: 25/12/2023
కోవిడ్-19: భారతదేశంలో తాజా కేసులు, ప్రస్తుత యాక్టివ్
కేసులు మరియు జేఎన్.1 కేసుల వివరాలు ఇవే (25/12/2023)
======================
మన దేశంలో
కరోనా కొద్ది కొద్దిగా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రియాశీల కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 63కు చేరాయని సోమవారం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ
వేరియంట్ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు (4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన
ప్రకటనలో పేర్కొంది.
జేఎన్.1 వేరియంట్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే
కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా
కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ
జేఎన్.1 వేరియంట్కు సంబంధించి ఈ తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి
పూర్తిగా కోలుకున్నారని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ ఉపరకం కేసులు
ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్ తోపాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది.
దీన్ని 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా పేర్కొన్న డబ్ల్యూహెచ్.. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని
పేర్కొంది.
ప్రస్తుత
శీతాకాల సీజన్ పరిగణనలోకి తీసుకొని కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. జేఎన్.1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే దీని
వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు.
======================
======================
0 Komentar