Cyclone Michaung: Heavy Rains Alert in All
AP Districts on Dec 3,4 & 5
మిచౌంగ్ తుఫాను:
డిసెంబర్ 3,4 & 5 తేదీల్లో ఏపీ లోని అన్నీ జిల్లా లకి
భారీ వర్షాల హెచ్చరిక
=====================
బంగాళాఖాతంలో
ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. ఆదివారానికి (Dec 3) తుపానుగా బలపడనుంది. మంగళవారం (Dec 5) ఉదయం
నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం
సూచించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 80-100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీనికి 'మిచౌంగ్’ గా
పేరుపెట్టారు. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లోని
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
90 కి.మీ.
వేగంతో గాలులు
సోమవారం (Dec 4) ఉదయానికి తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరానికి చేరుతుందని అమరావతి వాతావరణ
కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అనంతరం ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి
సమాంతరంగా వస్తుందని, మంగళవారం (Dec 5) ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని
పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో ఆదివారం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ
ఎండీ అంబేడ్కర్ కోరారు.
1. ఆదివారం
(Dec 3)
భారీవర్షాలు:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి.
ఓ మోస్తరు
వానలు: అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు.
2. సోమవారం
(Dec 4)
భారీ నుంచి
అతిభారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి
సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు.
ఓ మోస్తరు
వానలు: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి.
3. మంగళవారం
(Dec 5)
భారీ నుంచి
అతిభారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి
సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ.
ఓ మోస్తరు
వర్షాలు: కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.
4. బుధవారం
(Dec 6)
ఓ మోస్తరు, భారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ.
=====================
CHECK THE
LIVE WEATHER WEBSITE
=====================
0 Komentar