Geminid Meteor Shower 2023: All the Details Here
ఆకాశంలో ఐదు
రోజుల పాటు జెమినిడ్ ఉల్కాపాతం - ప్రత్యక్షంగా చూడవచ్చు
======================
అంతరిక్షం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను (Meteor Shower) మనం నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సంచాలకులు శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు. డిసెంబరు 16 నుంచి 20 వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకూ వేర్వేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.
పాథియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో
కొద్దినెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇది కొన్ని పదార్థాలతో కలిసి
రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడుతుంది. ఈ క్రమంలో ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత
సంస్థ(ఐఎంఓ) వెబ్సైట్లో తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఈ
ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని, వాటిని చూసిన
వారు ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఐఎంఓ
వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని పేర్కొంది.
మన భూ గ్రహం
నుంచి తోకచుక్కలు లేదా గ్రహశకలాల నుంచి వచ్చిన శిధిలాల మార్గాల గుండా
వెళుతున్నప్పుడు ఉల్కలు ఏర్పడతాయి. ఈ శిధిలాలు భూ వాతావరణాన్ని తాకినప్పుడు మండి
అద్భుతమైన కాంతి చారలను సృష్టిస్తాయి. 3200 ఫాథియాన్ గ్రహశకలం ఖగోళ శిథిలాల ద్వారా జెమినిడ్స్ ప్రేరేపించినట్టు
పేర్కొన్నారు.
నాసా
మెటోరాయిడ్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీస్ ప్రధాన అధికారి బిల్ కుక్ మాట్లాడుతూ..
ఉల్కాపాతం రసాయన కూర్పు భూమి వాతావరణాన్ని తాకి మండేటప్పుడు అది ఏ రంగును విడుదల
చేస్తుందో లేదా ఉత్పత్తి చేస్తుందో నిర్ణయిస్తుందని చెప్పారు. ఆక్సిజన్, మెగ్నీషియం, నికెల్ వంటి
మూలకాలను కాల్చినప్పుడు ఆకుపచ్చ రంగు ఉత్పత్తి అవుతుంది.
శిథిలాల్లో
సోడియం కాల్షియం వంటి లోహాల జాడలు ఉండటం వల్ల రంగులు పాక్షికంగా ఏర్పడతాయి. ఇక, జెమినిడ్స్‌మెటార్ భారత్‌లో డిసెంబర్ 14 గురువారం సాయంత్రం 5.30 గంటలకు కనిపించడం ప్రారంభమైంది. ఆ సమయంలో దాని ప్రకాశవంతమైన పాయింట్లు తూర్పు
హోరిజోన్ నుంచి పైకి లేచాయి. ఇది మరుసటి రోజు వరకు ఉదయం 7.30 గంటల వరకు కనిపించింది. దీని వేగం గంటకు 1.25 లక్షలు అంటే అత్యంత వేగంగా వెళ్లే బుల్లెట్ వేగం కంటే 40 రెట్లు ఎక్కువ.
======================
0 Komentar