Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JioTV Premium Plans Starting at Rs. 398 With 14 OTT Subscriptions – Details Here

 

JioTV Premium Plans Starting at Rs. 398 With 14 OTT SubscriptionsDetails Here

కొత్తగా జియోటీవీ ప్రీమియం ప్లాన్ లు ప్రారంభం - 14 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ – ప్లాన్ ల వివరాలు ఇవే

=====================

రిలయన్స్ జియో సంస్థ వరి జియోటీవీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ను ప్రారంభించింది. జియో ప్రీపెయిడ్ యూజర్లు 14 ఓటీటీ యాప్స్ ను వినియోగించుకునేలా సింగిల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందుకోసం మూడు వేర్వేరు ప్రీపెయిడ్ ప్లాన్లను సైతం జియో లాంచ్ చేసింది. వేర్వేరు సబ్స్క్రిప్షన్లతో పనిలేకుండా ఒకే రీఛార్జిపై వివిధ ఓటీటీ సేవలను పొందేందుకు జియోటీవీ ప్రీమియం ప్లాన్ ఉపయోగపడనుంది.

జియోటీవీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల కాలవ్యవధిపై మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. వీటి ధరలను రూ.398, రూ.1198, రూ.4,498గా నిర్ణయించింది. ఓటీటీ సబ్స్క్రిప్షన్ తో పాటు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్లలో లభిస్తాయి. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్ స్టార్, సోనీలివ్, జీత్, అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), సన్ నెక్స్ట్ వంటి 14 ఓటీటీ యాప్స్ ను వీక్షించొచ్చు. ఈ ప్లాన్లు కేవలం జియో యూజర్లకు మాత్రమే.

ప్లాన్ల వివరాలు

రూ.398 సబ్స్క్రిప్షన్ కింద 12 ఓటీటీ యాప్స్ లభిస్తాయి. అదే రూ.1198,. రూ.4498 ప్లాన్ల కింద అయితే 14 ఓటీటీ యాప్స్ వస్తాయి. వార్షిక ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. డిసెంబర్ 16 నుంచి ప్లాన్స్ కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. జియో మొబైల్ నంబర్ తో జియో టీవీ ప్రీమియం ఓటీటీ కంటెంట్ ను పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ ను ‘MY JIO’ యాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. డిస్నీ+ హాట్ స్టార్ ను వినియోగించాలంటే నేరుగా జియో నంబర్ లాగిన్ అవ్వొచ్చు. మై జియో యాప్ లో కూపన్ సెక్షన్ లోకి వెళ్లి జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.

=====================

DIRECT RECHARGE LINK

JIO TV APP

MY JIO APP

JIO WEBSITE

JIO TV WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags