Legendary Actor Kaikala Satyanarayana Biography
నవరస
నటసార్వభౌముడు – ప్రముఖ తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ జీవిత విశేషాలు
=====================
ప్రఖ్యాత
తెలుగు సినీనటుడు కైకాల సత్యనారాయణ గారు కృష్ణాజిల్లా కౌతారం గ్రామంలో జులై 25, 1935న
జన్మించారు. గుడివాడ కాలేజీలో ఆయన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. నటనపై ఉన్న
ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్
ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించి
'సిపాయి కూతురు'లో అవకాశం
ఇచ్చారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్ గా ఆయన
కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుతో పాటు
చిరంజీవి,
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ
నటించారు.
విభిన్న
పాత్రలు
యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి
పాత్రల్లో ఆయన మెప్పించారు. 'కృష్ణార్జున యుద్ధం', 'లవకుశ', 'నర్తనశాల', 'పాండవ వనవాసం', 'శ్రీ కృష్ణ పాండవీయం', 'శ్రీకృష్ణావతారం', 'వరకట్నం', 'పాపం పసివాడు', 'మానవుడు దానవుడు', 'యమగోల', 'సోగ్గాడు', 'సీతా స్వయంవరం', 'అడివి రాముడు', 'దానవీరశూర కర్ణ', 'కురుక్షేత్రం', 'డ్రైవర్ రాముడు', 'అగ్నిపర్వతం', 'విజేత', 'కొండవీటి దొంగ', 'కొదమసింహం', 'యమలీల', 'అరుంధతి' చిత్రాల్లో ఆయన
నటించారు. మహేష్ 'మహర్షి' తర్వాత ఆయన స్క్రీన్ పై కనిపించలేదు.
రాజకీయాల్లోనూ
ఆయన తనదైన ముద్ర వేశారు. లోక్ సభ ఎంపీగానూ సేవలు అందించారు.
కైకాల
సత్యనారాయణ ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో డిసెంబర్ 23, 2022 వేకువజామున 4 గంటలకు తన 87
వ ఏట తుదిశ్వాస విడిచారు.
====================
0 Komentar