New Rule in Cricket - Stop-Clock Rule –
Details Here
క్రికెట్‌లో
కొత్త రూల్ – ‘స్టాప్-క్లాక్’ రూల్ – తెలుసుకోవాలిసిన విషయాలు ఇవే
===================
ఐసీసీ ఒక నూతన
ప్రయోగం నేటి (Dec 12) నుండి చేయబోతోంది. 'స్టాప్ క్లాక్’ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
దీని ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు మరో ఓవర్ తొలి బంతి వేసేందుకు బౌలర్ సిద్ధంగా ఉండాలని ఐసీసీ
తెలిపింది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే రెండు సార్లు హెచ్చరిస్తారు. మూడోసారి
నుంచి ఫీల్డింగ్ జట్టుకు అయిదు పరుగుల జరిమానా విధిస్తారు.
వెస్టిండీస్ మరియు
ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ లో భాగంగా
మంగళవారం జరిగే తొలి మ్యాచ్ నుంచే ఈ 'స్టాప్
క్లాక్'
నిబంధన ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. "అంతర్జాతీయ
క్రికెట్ లో ఆట వేగాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని మార్గాలను పరిశీలిస్తూనే ఉంటాం.
2022లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు విజయవంతం కావడంతో ఇప్పుడు
పరిమిత ఓవర్ల అంతర్జాతీయ క్రికెట్ లో ‘స్టాప్ క్లాక్’ ను ప్రయోగాత్మకంగా
పరిశీలిస్తున్నాం. ఈ పరిశీలించే కాల వ్యవధి ముగిసిన తర్వాత దీని ఫలితాలను అంచనా
వేస్తాం" అని ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) వసీం ఖాన్ పేర్కొన్నాడు.
===================
Introducing the stop clock to speed up play ⏱
— ICC (@ICC) December 12, 2023
All you need to know about the trial from December 2023 to April 2024 📝https://t.co/jJEmGNr3Ic
0 Komentar