Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Pariksha PeCharcha 2024 - All the Details

 

Pariksha PeCharcha 2024 - All the Details

పరీక్షా పే చర్చ – 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

పరీక్షా పే చర్చ – 2024: దేశ ప్రధాని మోదీ ముచ్చటించిన విషయాలు ఇవే

విద్యార్థుల లో పరీక్షల గురించి ఒత్తిడి పోగొట్టేందుకు ప్రధాని మోదీ సోమవారం 'పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని భారత మండపంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముచ్చటించారు. ఈసందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు, సూచనలిచ్చారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు.

ఎవరితో పోల్చవద్దు.

"మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు. అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారు. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ను తమ సొంత విజిటింగ్ కార్డ్ భావిస్తారు. ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెబుతారు. అది కరెక్ట్ కాదు" అని తల్లిదండ్రులకు ప్రధాని సూచించారు.

ఉపాధ్యాయుల అంటే కేవలం ఉద్యోగం కాదు..

"ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదు. విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి" అని ఉపాధ్యాయులకు ప్రధాని సూచించారు. "పోటీ, సవాళ్లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ విషయంలోనూ పక్క వాళ్లతో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీపడండి" అని విద్యార్థులకు తెలిపారు.

నాకు పరీక్ష లాంటిదే..

"విద్యార్థులు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్రోగ్రామ్ నాక్కూడా పరీక్ష లాంటిదే" అని మోదీ వ్యాఖ్యానించారు.

=====================

Pariksha Pe Charcha 2024 LIVE | PM Modi Interacts with Students, Teachers & Parents on Exams

Date: 29/01/2024

Time: 11.00 AM

YouTube Links:

https://www.youtube.com/watch?v=mzXQU0H9kQ0

https://www.youtube.com/watch?v=BDaYKEFNqco

=====================

UPDATE 14-01-2024

పరీక్షా పే చర్చ – 2024 తేదీ ఖరారు

తేదీ: 29/01/2024

పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 'పరీక్షా పే చర్చ-2024’ కార్యక్రమం తేదీ ఖరారైంది. జనవరి 29న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ ముఖాముఖి నిర్వహిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. గతేడాదితో పోలిస్తే 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5. 69 లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా హాజరుకానున్నారు.

ఆరో తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు చర్చలో పాల్గొనేందుకు అర్హులు. ఈ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. దీని చర్చ ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై విద్యార్థులతో ముచ్చటిస్తారు.

=====================

పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2024 లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.

ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు. ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 6-12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేస్తుకవనవచ్చు.

=====================

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభ తేదీ: 11-12-2023  

రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీ: 12-01-2024   

=====================

CLICK TO PARTICIAPTION REGISTRATION

CLICK FOR DIRECT MESSAGE TO PM

WEBSITE 1

WEBSITE 2

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags