TS Govt
to Implement Free Bus Travel for Women in TSRTC Palle Velugu & Express Buses
from Dec 9 – G.O. Released
టీఎస్ ఆర్టీసీ: డిసెంబర్ 9 నుంచి పల్లె వెలుగు & ఎక్స్‌ప్రెస్
బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – మార్గదర్శకలతో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
====================
తెలంగాణ రాష్ట్రం లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
చెప్పింది. 9వ తేదీ (శనివారం) మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా
ప్రయాణించ వచ్చని తెలిపింది.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత
ప్రయాణం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు
గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే, పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర
ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని
ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.
====================
> జిల్లాల్లో
పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్
బస్సుల్లో ఉచితం. నగరాల్లో అయితే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో
బస్సుల్లో ఉచితం.
> వయసుతో సంబంధం లేకుండా మహిళలు, ట్రాన్స్ జెండర్లందరికీ ఉచితం.
> ఆధార్ లాంటి ఏదో ఒక ID కార్డు చూపించి ప్రయాణించవచ్చు.
> ఇతర రాష్ట్రాలకు వెళ్లే TSRTC బస్సుల్లోనూ ఉచితం. అయితే తెలంగాణ సరిహద్దుల వరకే ఉచితం
> రాష్ట్రం దాటితే డబ్బులు పెట్టి టికెట్
తీసుకోవాలి.
> శనివారం (Dec 8) మ.2 గంటల నుంచి పథకం ప్రారంభం.
====================
TRANSPORT
DEPARTMENT Launch Of "MAHA LAKSHMI SCHEME"- Free Travel for girls and
women of all age groups and transgender persons in the State run Palle velugu
and Express Buses of TSRTC within Telangana State w.e.f.09.12.2023 A.N. -
Orders Issued.
TRANSPORT, ROADS & BUILDINGS (Tr.II) DEPARTMENT
G.O.Ms.No.47, Dated:08.12.2023
====================
====================
0 Komentar