Xiaomi Unveils Their
First Electric Car - SU7 – Details Here
స్మార్ట్ ఫోన్
ల తయారీ సంస్థ షావోమీ తొలి విద్యుత్ కారు SU7
ఆవిష్కరణ – ఫీచర్ల వివరాలు ఇవే
======================
స్మార్ట్ ఫోన్
ల తయారీ సంస్థ షావోమీ గురువారం (Dec 28) తొలి
విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ 'లీ జున్' దీన్ని పరిచయం
చేశారు. SU7
పేరిట వస్తున్న ఈ సెడాన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టము..
కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా
పేరొందిన 'కాన్టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ', బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో
వినియోగిస్తున్నారు.
ఈ కారుని 'సెల్-టు-బాడీ' టెక్నాలజీతో
అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే
అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు.
ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు.
ఈ కారు SU7,
SU7 మ్యాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. SU7 0-100
kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని
విడుదల చేస్తుంది. మరోవైపు SU7 మ్యాక్స్ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్ తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని
ఉత్పత్తి చేస్తుంది.
తక్కువ
ఉష్ణోగ్రతల్లోనూ వేగంగా ఛార్జ్ అయ్యేలా కారుని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆక్వా
బ్లూ,
మినరల్ గ్రే, వెర్డెంట్
గ్రీన్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.
======================
At the pinnacle of performance, the ultimate driving experience is our starting point in crafting vehicles.#XiaomiEVTechnologyLaunch pic.twitter.com/tSBthJbZcn
— Xiaomi (@Xiaomi) December 28, 2023
0 Komentar