Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 31-01-2024

 

AP Cabinet Meeting Highlights - 31-01-2024

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే – 31-01-2024

==================

నేడు (జనవరి 31) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్ సర్వీసులు నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే

> డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం.  

 > 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం.

> ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.

> ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్.

> ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం.

> ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం.

> ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం.

> యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపు.

> అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.

> నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం.

> శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

> ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

> న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం.

> అసైన్డ్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం.

> ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేచర్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

> డిజిటల్ ఇన్ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం. 

==================

CLICK FOR CABINET MEETING AGENDA 31-01-2024

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags