BoAt Lunar Pro LTE Smartwatch with eSIM Connectivity
Launched – Features & Price Details Here
ఇ-సిమ్
సపోర్ట్ తో బోట్ స్మార్ట్ వాచ్ - ధర & ఫీచర్ల వివరాలు ఇవే
=====================
మన ఫోన్ పై ఆధారపడకుండా
కాల్స్ మరియు SMS లు స్మార్ట్ వాచ్ లో ఉండే ఈ-సిమ్ ద్వారా
చేయవచ్చు.
=====================
బోట్ (boAt) ఇ-సిమ్ సపోర్ట్ తొలి స్మార్ట్ వాచ్ భారత్ లో విడుదల లాంచ్
చేసింది. లూనార్ ప్రో ఎల్టీఈ (boAt Lunar Pro LTE) పేరిట
దీన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రముఖ టెలికాం కంపెనీ జియోతో జట్టు కట్టింది. ఈ స్మార్ట్
వాచ్ ధర రూ.7,999గా నిర్ణయించింది. స్లీక్ బ్లాక్, రిఫైన్డ్
బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది. ఇప్పటికే విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపింది.
ఫ్లిప్కార్ట్లో పాటు బోట్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ
వెల్లడించింది.
ఇ-సిమ్
సపోర్ట్ వస్తుండటంతో సులువుగా ఈ స్మార్ట్ వాచ్ తో కాల్స్, మెసేజ్లు చేసుకోవచ్చు. ఈ వాచ్ 1.39 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే
ఉంటుంది. 600 నిట్స్ వరకు బ్రెట్నెస్ ఇస్తుంది. జీపీఎస్ సదుపాయంతో తీసుకొచ్చిన ఈ
స్మార్ట్వచ్లో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. దుమ్ము, నీరు లోనికి చేరకుండా IP68 రేటింగ్ కలిగి ఉంటుంది.
ఎయిర్టెల్ (Airtel), జియో (Jio) సిమ్లకు
సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ దీన్ని తీసుకొచ్చారు. రెగ్యులర్
స్మార్ట్వచ్లలో ఉన్నట్లే యాక్టివిటీ ట్రాకింగ్, హార్ట్ రేట్
మానిటర్, SpO2 వంటి ఫీచర్లు ఉన్నాయి. 577mAh బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ వాచ్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఏడు రోజుల పాటు
పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
=====================
=====================
0 Komentar