Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Divya Ayodhya: Mobile App Released for Ayodhya Tourism

 

Divya Ayodhya: Mobile App Released for Ayodhya Tourism

'దివ్య అయోధ్య' యాప్: అయోధ్య భక్తుల కొరకు నూతన మొబైల్ యాప్  

=======================

అయోధ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు సమాచారం తెలుసుకునేందుకు 'దివ్య అయోధ్య' యాప్ ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్ (పర్యాటకులకు ఇంట్లో ఒక గదిని అద్దెకు ఇవ్వడం), హోటళ్లు, గుడారాలు, వీల్చైర్ అసిస్టెంట్, గోల్ఫ్ కార్ట్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను, టూరిస్ట్ గైడ్లను ముందస్తు బుకింగ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. యాప్ లో స్థానిక వంటలు, తప్పక చూడాల్సిన ప్రదేశాలు, టూర్ ప్యాకేజ్లకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

జనవరి 19 నుంచి లఖ్ నవూ- అయోధ్య మధ్య హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మహాక్రతువులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. సుమారు 11 వేల మందికి పైగా అతిథులు హాజరవుతారని ట్రస్టు సభ్యులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే వారికి దేశీ నెయ్యితో తయారుచేసిన మోతిచూర్ లడ్డూతో పాటు అయోధ్య మట్టిని చిన్న బాక్సుల్లో అందజేయనున్నట్లు ట్రస్టు సభ్యుడొకరు తెలిపారు. ఆహ్వానితులు ఎవరైనా ఈ కార్యక్రమానికి రాలేకపోతే వారు అయోధ్యను సందర్శించినప్పుడు ఈ మట్టిని అందజేస్తామని తెలిపారు.

=======================

About This App:

Navya Ayodhya, Bhavya Ayodhya, Navya Ayodhya UP government initiative - Single window platform for all your stay and travel needs.

Ayodhya Development Authority (ADA) is a principal agency of the Government of Uttar Pradesh, which is responsible for taking ahead the tradition of planned and sustainable development of Ayodhya and Faizabad.

=======================

DOWNLOAD MOBILE APP

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags