DME AP Recruitment 2024: Apply for 169
Assistant Professors in Super Specialties - Details Here
ఏపీ వైద్య కళాశాలల్లో 169 అసిస్టెంట్
ప్రొఫెసర్ పోస్టులు (సూపర్ స్పెషాలిటీస్)
– పూర్తి వివరాలు ఇవే
====================
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్
ఎడ్యుకేషన్... ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో
రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్ / లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్
ప్రొఫెసర్: 169 పోస్టులు
అర్హత:
సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (డీఎన్బీ, డీఎం, ఎంసీహెచ్) ఉత్తీర్ణులై ఉండాలి.
స్పెషాలిటీ:
కార్డియాలజీ, సీటీవీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్
సర్జరీ,
మెడికల్ అంకాలజీ, సర్జికల్
గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ సర్జికల్
గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, న్యూక్లియర్ మెడిసిన్.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక
విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్
రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.1000(బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500).
వాక్-ఇన్
రిక్రూట్మెంట్ తేదీ: 06.02.2024.
స్థలం:
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం, పాత జీజీహెచ్
క్యాంపస్,
హనుమాన్ పేట, విజయవాడ.
====================
====================
0 Komentar