LIC New Policy: Jeevan Dhara II - New Annuity
Plan – Details Here
ఎల్ఐసీ కొత్త పాలసీ: జీవన్ ధార II - కొత్త యాన్యుటీ ప్లాన్ – పూర్తి వివరాలు ఇవే
====================
ఎల్ఐసీ నుండి
నూతన పాలసీ వచ్చింది. 'జీవన్ ధార-II
(ప్లాన్ నంబర్. 872) పేరుతో పెన్షన్ ప్లాన్ ను లాంచ్ చేసింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ
ప్లాన్. జనవరి 22 నుంచి ఈ పాలసీ విక్రయాలు
ప్రారంభమయ్యాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్ లో కొనుగోలు
చేయొచ్చు. మొత్తం 11 ఆప్షన్లలో
వస్తోంది. డిఫర్మెంట్ పీరియడ్ లో బీమా కవరేజీ ఉంటుంది. రెగ్యులర్ లేదా సింగిల్
ప్రీమియం ఆప్షన్ ఎంచుకోవచ్చు.
అర్హతలు:
ఇది పెన్షన్
పథకం. మలి దశలో పెన్షన్ కోరుకునే వారు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో
పెన్షన్ కావాలంటే ఎక్కువ యాన్యుటీని కొనుగోలు చేయాలి. జీవన్ ధారా-2 పాలసీ రెగ్యులర్, సింగిల్
ప్రీమియం (ఒకేసారి చెల్లించాలి) ఆప్షన్లలో వస్తోంది. సింగిల్ లైఫ్తో పాటు జాయింట్
లైఫ్ యాన్యుటీ కవరేజీ (ఇద్దరి పేరిట) ఆప్షన్ కూడా ఉంది. ఈ పాలసీలో చేరేందుకు కనీస
వయసును 20 ఏళ్లుగా నిర్ణయించారు. యాన్యుటీ ఆప్షను బట్టి గరిష్ఠ వయసు
ఉంటుంది. ఏడాది నుంచి 15 ఏళ్ల డిఫర్మెంట్
పీరియడ్ ఉంటుంది. సింగిల్ ప్రీమియం, నెలవారీ, మూడు నెలలకోసారి, ఆరు
నెలలకోసారి, వార్షిక పద్ధతిలో ప్రీమియం
చెల్లించొచ్చు. యాన్యుటీని నెలకోసారి, మూడు నెలలు, ఆరు నెలలు, వార్షిక పద్ధతిలో
పొందొచ్చు.
యాన్యుటీ
ఆప్షన్లు
జీవన్ ధారా-2 పాలసీ మొత్తం 11 రకాల
ఆప్షన్లతో వస్తోంది. ఇందులో రెగ్యులర్ ప్రీమియం, సింగిల్ ప్రీమియం చెల్లించే వారికి వేర్వేరు ఆప్షన్లు
ఉన్నాయి. ఇందులో మళ్లీ సింగిల్ లైఫ్ యాన్యుటీ, జాయింట్ లైఫ్
యాన్యుటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
రెగ్యులర్
ప్రీమియం ఆప్షన్లు
ఆప్షన్ 1- జీవితం కాలం యాన్యుటీ.
ఆప్షన్ 2 - జీవితకాలం యాన్యుటీతో పాటు, ప్రీమియం మొత్తం వాపస్.
ఆప్షన్ 3 - 75 ఏళ్లు దాటిన తర్వాత 50 శాతం
ప్రీమియం వాపసు చేయడంతో పాటు జీవితాంతం యాన్యుటీ చెల్లిస్తారు.
ఆప్షన్ 4 - 75 ఏళ్లు దాటిన తర్వాత
100 శాతం ప్రీమియం మొత్తాన్ని వాపసు చేయడంతో పాటు జీవితాంతం
యాన్యుటీ లభిస్తుంది.
ఆప్షన్ 5 - 80 ఏళ్లు దాటిన తర్వాత 50 శాతం
ప్రీమియం వాపస్ + జీవితాంతం యాన్యుటీ.
ఆప్షన్ 6- 80 ఏళ్లు దాటిన తర్వాత 100 శాతం ప్రీమియం వాపస్ + జీవితాంతం యాన్యుటీ.
ఆప్షన్ -7 జీవితాంతం యాన్యుటీ + 76-95 ఏళ్లు వచ్చినప్పుడు 5 శాతం ప్రీమియం వాపస్.
ఆప్షన్ 8 - జాయింట్ లైఫ్ జీవిత
కాలం యాన్యుటీ.
ఆప్షన్ 9 - జాయింట్ లైఫు జీవితకాలం యాన్యుటీతో పాటు చెల్లించిన
ప్రీమియం వాపస్.
సింగిల్
ప్రీమియం ఆప్షన్లు
సింగిల్
ప్రీమియంలో కేవలం రెండు ఆప్షన్లే ఉంటాయి. జీవితాంతం యాన్యుటీ + యాన్యుటీ కొనుగోలు
మొత్తం వాపస్ అనేది ఆప్షన్-10 కింద లభిస్తుంది.
జాయింట్ లైఫ్కు జీవితాంతం యాన్యుటీ + యాన్యుటీ కొనుగోలు మొత్తం తిరిగి చెల్లింపు
అనేది ఆప్షన్ - 11 కింద లభిస్తుంది.
ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్నాక మార్చుకోవడం కుదరదు.
జాయింట్గా
ఎవరిని పెట్టుకోవచ్చు?
జాయింట్ లైఫ్
యాన్యుటీ కొనుగోలు పాలసీ భాగస్వామిగా మీ కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, పిల్లలు, మనవళ్లు), జీవిత భాగస్వామి, తోడబుట్టిన వాళ్లు, అత్తమామను
ఎంచుకోవచ్చు.
డిఫర్మెంట్
పీరియడ్లో పాలసీదారుడికి జరగరానిది జరిగితే (ఆప్షన్ 1-7, 10) ప్రీమియం మొత్తానికి 105 శాతం సొమ్మును నామినీకి అందజేస్తారు. డిఫర్మెంట్ పీరియడ్ తర్వాత యాన్యుటీ
నిలిచిపోతుంది. ఆప్షన్- 1 ఎంచుకున్న వారికి ఎలాంటి డెత్
బెనిఫిట్ అందదు. 2-10 ఆప్షన్లు ఎంచుకున్న
వారికి నూరు శాతం ప్రీమియం మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.
జాయింట్ లైఫ్
(ఆప్షన్ 8,
9, 11) ఎంచుకున్నప్పుడు డిఫర్మెంట్ పీరియడ్లో
ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే జీవించి ఉన్న వ్యక్తికి యాన్యుటీ కొనసాగుతుంది. ఆ
వ్యక్తి కూడా మరణించినప్పుడు నామినీకి ఆ మొత్తం చెల్లిస్తారు. యాన్యుటీ మొదలైన
తర్వాత ఏదైనా జరిగితే ఆప్షన్ 8 (జీవిత కాలం
యాన్యుటీ) ఎంచుకున్న వారికి ఎలాంటి డెత్ బెనిఫిట్స్ అందవు. ఆప్షన్ 9, 11 ఎంచుకున్న వారికి మాత్రం ప్రీమియం మొత్తం తిరిగి
చెల్లిస్తారు.
కనీస ప్రీమియం
జీవన్ ధారా-2లో నెలకు కనీస పెన్షన్ రూ.1000 నుంచి మొదలవుతుంది. అంటే ఏడాదికి రూ.12 వేలు
చొప్పున లభిస్తుంది. ఆ లెక్కన సింగిల్ ప్రీమియం అయితే కనీసం రూ. లక్ష
చెల్లించాల్సి ఉంటుంది. అదే రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి కనీస మొత్తం రూ. 11 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ఠ ప్రీమియం పై
ఎలాంటి పరిమితీ లేదు. యాన్యుటీ పెంచుకోవాలంటే టాపప్ సదుపాయం ఉంది.
====================
====================
0 Komentar