LIVE: Ayodhya Ram
Mandir - Inauguration Streaming - Ram Lala Pran Pratishtha Ceremony
ప్రత్యక్ష ప్రసారం: అయోధ్య రామమందిరం - రామ్ లాలా ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం
=====================
అయోధ్య
రామాలయ ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ప్రాణ ప్రతిష్ఠకు
వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా
వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని
అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే
పూజాది కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయి ఆదివారంతో ముగిశాయి.
అయోధ్య ఆలయ
విశేషాలు:
> రామ
మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
> విగ్రహాన్ని
కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.
> శుక్రవారం
కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది.
> ఆలయంలోకి
తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని
ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
> ఆలయాన్ని
3 అంతస్తుల్లో నిర్మించారు.
> ప్రధాన
ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది.
> ఆలయాన్ని
సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది.
> ప్రతి
అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.
=====================
0 Komentar