Padma Awards 2024 - Full List of Padma
Vibhushan, Padma Bhushan, Padma Shri Recipients
పద్మ
అవార్డులు-2024: పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ
గ్రహీతల పూర్తి జాబితా ఇదే
====================
మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి
లకు పద్మవిభూషణ్
తెలుగు
రాష్ట్రాల నుంచి మొత్తం 8 మందికి పద్మ పురస్కారాలు
====================
పలు రంగాల్లో
విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్ర
ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ
అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష
సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను
మొత్తంగా 132 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం..
వీటిలో ఐదుగురిని పద్మవిభూషణ్, 17 మందిని
పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ
పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 8 మందిని పద్మ
పురస్కారాలు వరించాయి.
మాజీ
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ
సినీనటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్
వరించింది. వీరితోపాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ
భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంలనూ ఈ అత్యున్నత పురస్కారానికి
ఎంపికచేసింది. బిహార్కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్క సామాజిక
సేవా విభాగంలో మరణానంతరం పద్మవిభూషణను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన
మొత్తం 132
మందికి కేంద్ర ప్రభుత్వం 'పద్మ'
పురస్కారాలు ప్రకటించింది. కళ, సామాజికసేవ, ప్రజా
వ్యవహారాలు, శాస్త్రసాంకేతికం, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవా రంగాల్లో
విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపికచేసి గౌరవిస్తోంది.
అసాధారణమైన విశిష్ట సేవలు చేసినవారికి పద్మవిభూషణ్, ఉన్నతస్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించినవారికి పద్మశ్రీ అవార్డులు
అందిస్తోంది. వచ్చే మార్చి-ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్ లో జరిగే
కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
గురువారం
రాత్రి ప్రకటించిన 132 పద్మ పురస్కారాల్లో
5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్,
110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది
మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9
మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా
రికార్డులకెక్కిన కేరళకు చెందిన దివంగత జస్టిస్ ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్
లభించింది. అలాగే మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రామ్నాయక్, కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఒ. రాజగోపాల్, ప్రముఖ
గాయనీమణి ఉషా ఉథుప్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయంలో ఒకరైన
ప్యారేలాల్ శర్మలకు పద్మభూషణ్ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రముఖ నటుడు
మిథున్ చక్రవర్తి, తమిళనాడు నుంచి దివంగత నటుడు విజయకాంత్ లకు
ఇవే పురస్కారాలు ప్రకటించింది.
పద్మవిభూషణులు
వీరే..
1. వైజయంతి
మాల బాలి (కళారంగం)- తమిళనాడు
2. కొణిదెల
చిరంజీవి (కళారంగం) - ఆంధ్రప్రదేశ్
3. వెంకయ్యనాయుడు
(ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్
4. బిందేశ్వర్
పాఠక్ (సామాజిక సేవ)- బిహార్
5. పద్మ
సుబ్రమణ్యం (కళారంగం)- తమిళనాడు
'పద్మభూషణ్'లు వీరే..
1. ఎం. ఫాతిమా బీవి (ప్రజా వ్యవహారాలు) - కేరళ
2. హర్మసీ ఎన్ కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
3. మిథున్ చక్రబర్తి (కళలు) - పశ్చిమ బెంగాల్
4. సీతారామ్ జిందాల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – కర్ణాటక
5. యువాంగ్ లీయూ (వాణిజ్యం, పరిశ్రమలు) - తైవాన్
6. అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం) - మహారాష్ట్ర
7. సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (ప్రజా వ్యవహారాలు) - పశ్చిమ బెంగాల్
8. రామ్ నాయక్ (ప్రజా వ్యవహారాలు) – మహారాష్ట్ర
9. తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం) – గుజరాత్
10. ఓలంచేరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు) – కేరళ
11. దత్తాత్రేయ అంబాదాస్ మయాలు (కళలు) – మహారాష్ట్ర
12. తోగ్డాన్ రినోపోచే (మరణానంతరం) (ఆధ్యాత్మికం) – లద్ధాఖ్
13. ప్యారేలాల్ శర్మ(కళలు) - మహారాష్ట్ర
14. చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం) - బిహార్
15. ఉషా ఉతప్ (కళలు) - పశ్చిమబెంగాల్
16. కెప్టెన్ విజయకాంత్ (మరణానంతరం) (కళలు) – తమిళనాడు
17. కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
తెలుగు
రాష్ట్రాల్లో విరిసిన ‘పద్మశ్రీ’ లు వీరే..
1. గడ్డం
సమ్మయ్య (కళలు)- తెలంగాణ
2. కురెల్ల
విఠలాచార్య (లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) - తెలంగాణ
3. కేతావత్
సోమ్లాల్ (లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్) - తెలంగాణ
4. వేలు
ఆనందచారి (కళలు) - తెలంగాణ
5. దాసరి
కొండప్ప (కళలు) - తెలంగాణ
6. ఉమా
మహేశ్వరి (కళలు) - ఆంధ్రప్రదేశ్
====================
====================
0 Komentar