Pradhan Mantri
Suryodaya Yojana - 1 Crore Households to Get Rooftop Solar Under the Scheme
ప్రధాన
మంత్రి సూర్యోదయ యోజన - పథకం కింద దేశ వ్యాప్తంగా కోటి గృహాల పై సోలార్ ప్యానెల్ల ఏర్పాటు
======================
భారత దేశ ప్రధాని
మోదీ నిన్న (జనవరి 22) ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన' పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా దేశ
వ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అయోధ్య నుంచి దిల్లీ చేరుకున్న ఆయన ఈ పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించారు. అనంతరం 'ఎక్స్' వేదికగా మోదీ
ప్రకటించారు.
"సూర్యవంశానికి చెందిన రాముడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ నిరంతరం
శక్తిని పొందుతుంటారు. ఈరోజు అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్ఠాపన శుభ సందర్భంగా
భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్లపై సొంత సౌర వ్యవస్థను కలిగి ఉండాలన్న నా సంకల్పం
మరింత బలపడింది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్
ఏర్పాటు చేయబోతున్నాం" అని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లులను తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారత్ స్వావలంబన దిశగా పయనించేందుకు దోహదం
చేస్తుందని పేర్కొన్నారు.
======================
सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं।
— Narendra Modi (@narendramodi) January 22, 2024
आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो।
अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV
0 Komentar