Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Rohan Bopanna Becomes Oldest First-Time World No. 1 with Maiden Semifinal in AO-2024 Men's Doubles

 

Rohan Bopanna Becomes Oldest First-Time World No. 1 with Maiden Semifinal in AO-2024 Men's Doubles

చరిత్ర సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న - మొదటి సారిగా పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నెం. 1 ర్యాంక్ 

====================

భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. అత్యంత పెద్ద వయసులో (43 ఏళ్లు) డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకర్ గా అవతరించాడు. తాజాగా డబుల్స్ లో తన పార్టనర్ మాథ్యూ ఎబ్డెన్ తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్ కు  చేరుకోవడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ద్వయం మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టేనిపై వరుస సెట్లలో 6-4, 7-5 తేడాతో రోహన్ జోడీ విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ముందు బోపన్న మూడో ర్యాంక్ లో ఉన్నాడు. అప్డేట్ చేసిన ర్యాంకుల జాబితా వచ్చే వారం విడుదల కానుంది. తన డబుల్స్ పార్ట్నర్ మాథ్యూ ఎబ్డెన్ రెండో ర్యాంకుకు చేరాడు.

ప్రపంచ నంబర్ వన్ చేరుకున్న తర్వాత బోపన్న చెప్పిన మాటలు ఇవే

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకుకు చేరుకోవడంపై బోపన్న స్పందించాడు. "నా 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వారాలపాటు టోర్నీలు ఆడుతూ ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. భారత్ తరఫున టాప్ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. టీమ్ మొత్తానికి క్రెడిట్ వస్తుంది. కుటుంబం, కోచ్, ఫిజియో.. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇది భారత టెన్నిస్ కు అత్యంత ముఖ్యం. మరింత మంది క్రీడాకారులు రావడానికి మార్గం చూపిస్తుందని భావిస్తున్నా" అని వ్యాఖ్యానించాడు.

====================

CLICK FOR BOPANNA INETERVIEW

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags