ఏపీ ఉపాధ్యాయ
అర్హత పరీక్ష (టెట్) 2024: ముఖ్యమైన వివరాలు
ఇవే
====================
UPDATE
25-06-2024
AP TET
2024: ఫలితాలు విడుదల
AP TET 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించగా.. 2.35 లక్షల మంది
హాజరయ్యారు. ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల
కోడ్ కారణంగా వెల్లడించలేదు. టెట్ లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది.
మెగా డీఎస్సీతోపాటు మరో టెట్ - జులై 1న మెగా డీఎస్సీ & టెట్ కు ప్రకటనలు విడుదల చేసే అవకాశం
మెగా డీఎస్సీతోపాటు మరో టెట్ నిర్వహించేందుకు కొత్త
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో
అర్హత సాధించని వారు, ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు
పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్ నిర్వహించాలని
నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో
దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి
సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా
నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది.
జులై 1న మెగా డీఎస్సీ, టెట్ కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం
ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేసి, కొత్తగా 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తారు. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు
రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
====================
UPDATE 30-03-2024
AP DSC & TET 2024: ఫలితాలు & పరీక్షల అప్డేట్
ఏపీ: డీఎస్సీ, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్)ల విషయంలో కేంద్ర ఎన్నికల
సంఘం (సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ
డీఎస్సీ పరీక్ష, టెట్ పరీక్షా ఫలితాల వెల్లడిని వాయిదా
వేయాలని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి
ముకేష్ కుమార్ మీనా... కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు & డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.
====================
UPDATE
21-03-2024
AP
TET-2024: ఫలితాల విడుదల
గురించి అప్డేట్
ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాతనే టెట్ ఫలితాలను
వెల్లడించనున్నట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది. దీని గురించి ప్రభుత్వం అధికారిక
ప్రకటనను విడుదల చేసింది.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం
వెయిటేజీ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తే డీఎస్సీకి అర్హులవుతారు. మొదట ప్రకటించిన
షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా..
ఎన్నికల నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టత వస్తేనే ఫలితాలు వెల్లడి కానున్నాయి.
====================
UPDATE
18-03-2024
AP TET-2024: అన్నీ పరీక్షల తుది ‘కీ’లు విడుదల
====================
UPDATE 09-03-2024
AP TET-2024: అన్నీ పరీక్షల ప్రశ్నా పత్రాలు, 'కీ'లు, రెస్పాన్స్ షీట్స్
విడుదల
UPDATE
04-03-2024
ఏపీ టెట్, టీఆర్టీ (DSC) షెడ్యూల్ పై నేటి (మార్చి 4) హైకోర్టు తీర్పు ఇదే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతోన్న టెట్ మరియు
టీఆర్టీ (DSC) పరీక్షల షెడ్యూల్ లో మార్పు చెయ్యాలని
ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం
ఉండాలని, రాత పరీక్ష తర్వాత 'కీ'పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది.
ఇప్పటిదాకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14 న టెట్ ఫలితాలు
విడుదల అవుతాయి. మార్చి 15 నుండి టీఆర్టీ (DSC) పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ షెడ్యూల్
లో మార్పులు జరిపి కొత్త షెడ్యూల్ ను విడుదల అవుతుందని తెలిస్తోంది.
====================
UPDATE
23-02-2024
AP TET
2024: పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్షల తేదీలు: 27-02-2024
నుండి 06-03-2024 వరకు
AP-TET
FEB-2024 NORMALIZATION FORMULA
====================
AP TET 2024: Mock Tests
====================
AP SCERT: 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు
టెక్స్ట్ బుక్స్ (2023) - Useful for AP TET & DSC 2024
==================
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు ముహూర్తం ఖరారైంది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్ధులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఏపీ ఉపాధ్యాయ
అర్హత పరీక్ష (టెట్)- 2024
అర్హతలు:
పేపర్ ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్
లేదా తత్సమానం. 2023-24 విద్యా సంవత్సరం
చివరి ఏడాది చదివే అభ్యర్ధులూ అర్హులే.
కమ్యూనిటీ
వారీ ఉత్తీర్ణతా మార్కులు
1. ఓసీ(జనరల్)- 60% మార్కులు ఆపైన
2. బీసీ- 50% మార్కులు ఆపైన
3. ఎస్సీ/ ఎస్టీ/ పీ హెచ్/ ఎక్స్ సర్వీస్మెన్- 40% మార్కులు ఆపైన
పరీక్ష
విధానం: ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) గా నిర్వహిస్తారు. రోజుకు
రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను
ఎంపిక చేశారు. బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలో ఏర్పాటు చేస్తామన్నారు.
పరీక్ష
రుసుము: రూ.750.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 08-02-2024
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 08-02-2024
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 17-02-2024
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 18-02-2024
ఆన్లైన్ మాక్
టెస్ట్ సదుపాయం: 19-02-2024
హాల్ టికెట్ల
విడుదల తేదీ: 23-02-2024
పరీక్షల తేదీలు: 27-02-2024 నుండి 09-03-2024 వరకు
పరీక్ష సమయం:
సెషన్-1:
ఉదయం 9.30 గంటల నుంచి
మధ్యాహ్నం 12 వరకు. సెషన్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు.
ప్రాథమిక 'కీ' విడుదల: 10-03-2024
అభ్యంతరాల
స్వీకరణ: 11-03-2024
తుది ‘కీ’
విడుదల: 13-03-2024
ఫలితాలు విడుదల తేదీ: 14-03-2024
పూర్తి
నియామక ప్రక్రియ రోజులు: 35 రోజులు
====================
AP
DSC & TET - 2024 TENTATIVE DATES
====================
Reference:
AP TET-2024 -టెట్ పేపర్-1కు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారే
అర్హులు - అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
G.O.Ms.No:4, Dated: 26/01/2024
====================
AP TET- 2024 - రెండో పేపర్ అర్హత మార్కుల్లో మినహాయింపు
Memo.No.1331600 /Services-I/A1/2023,
Dated:26/01/2024
====================
0 Komentar