Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP TWREI CET for Admissions 2024-25 into 8th Class SOEs & 1st Year Intermediate COEs – Details Here

 

AP TWREI CET for Admissions 2024-25 into 8th Class SOEs & 1st Year Intermediate COEs – Details Here

ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో (SOE/COE) 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి & ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలు – పూర్తి వివరాలు ఇవే  

=====================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (SOE/COE)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరములో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) విడుదల చేసింది. అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

ఏడు గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ల వివరాలు  

1. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (పీజీటీ), మల్లి

2. స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, విశాఖపట్నం

3. స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, పార్వతీపురం (జోగింపేట)

4. కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్, విస్సన్నపేట

5. స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, శ్రీకాళహస్తి

6. స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, శ్రీశైలం డ్యామ్

7. కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్, తనకల్లు

సీట్ల సంఖ్య: ఇంటర్ ఎంపీసీ- 300; ఇంటర్ బైపీసీ- 300; 8వ తరగతి- 180.

అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం ఏడో తరగతి ఉత్తీర్ణులై విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

ప్రశ్నపత్రం: ఎనిమిదో తరగతికి ఏడో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు (10 మార్కులు), ఇంగ్లిష్ (10 మార్కులు), హిందీ (10 మార్కులు), మ్యాథ్స్ (20 మార్కులు), ఫిజికల్ సైన్స్ (15 మార్కులు), బయోసైన్స్ (15 మార్కులు), సోషల్ స్టడీస్ (20 మార్కులు) సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్కి పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ (20 మార్కులు), మ్యాథ్స్ (40 మార్కులు), ఫిజికల్ సైన్స్ (20 మార్కులు), బయోసైన్స్ (20 మార్కులు) సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-03-2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25-03-2024.

హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 30-03-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 07-04-2024.

మెరిట్ జాబితా వెల్లడి: 05-05-2024.

మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: 20-05-2024.

రెండో దశ కౌన్సెలింగ్ తేదీ: 25-05-2024.

=====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags