Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Bank of India Recruitment 2024: Apply for 3000 Apprentice Posts – Details Here

 

Central Bank of India Recruitment 2024: Apply for 3000 Apprentice Posts – Details Here

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3,000 అప్రెంటిస్ ఖాళీలు దరఖాస్తు మరియు స్టైపెండ్ వివరాలు ఇవే

======================

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డివిజన్) సెంట్రల్ ఆఫీస్... దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్ షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అప్రెంటిస్: 3,000 ఖాళీలు

1. ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).

2. తెలంగాణలో 96 ఖాళీలు (హైదరాబాద్- 58, వరంగల్- 38)

శిక్షణ కాలం: ఒక సంవత్సరం.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్ శాఖలు రూ.15,000. పట్టణ శాఖలు రూ.15,000. మెట్రో శాఖలు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్ 3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ 4. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ 5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ / మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 21-02-2024.

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 06-03-2024.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 10-03-2024.

======================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags