Ola Electric Launches New ‘Ola S1 X
(4kWh)’ with Price Rs 1.09 Lakh – Details Here
ఓలా
ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్ Ola S1 X (4kWh) – ధర, ఫీచర్లు
మరియు వారెంటీ వివరాలు ఇవే
=====================
ఓలా
ఎలక్ట్రిక్ మరో కొత్త స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతకు ముందు ఉన్న ఎస్1 ఎక్స్ శ్రేణిలో 4kWh బ్యాటరీ ప్యాక్ కొత్త స్కూటర్ ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. ఇది సింగిల్ ఛార్జి 190 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ స్కూటర్లో 6kW మోటార్ ను అమర్చారు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. రెడ్ వెలాసిటీ, మిడ్నైట్, వోగ్, స్టీలర్, ఫంక్, పోర్స్ లెయిన్ వైట్, లిక్విడ్ సిల్వర్
రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 10.9 సెంటీమీటర్ల సెగ్మెంటెడ్ డిస్ప్లే ఇచ్చారు. ఫిజికల్ కీ
అన్లాక్ ఉంటుంది. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఏవీ ఇందులో ఉండవు.
వారెంటీ – 8 ఏళ్లు
ఈవీ బ్యాటరీ
విషయంలో వినియోగదారులకు ఉన్న అనుమానాలకు తెరదించుతూ ఓలా కొత్త వారెంటీ సదుపాయాన్ని
తీసుకొచ్చింది. 8 ఏళ్లు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారెంటీని ఉచితంగా
ఇస్తున్నట్లు పేర్కొంది. అన్ని వాహనాలకూ ఇది వర్తిస్తుంది. కావాలంటే కిలోమీటర్ల
పరిమితిని 1.25 లక్షల వరకూ పెంచుకోవచ్చని ఓలా
పేర్కొంది. సర్వీస్ నెట్వర్క్పనా ఓలా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 414 సర్వీస్ సెంటర్లు ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆ
సంఖ్యను 600కు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది.
=====================
=====================
0 Komentar