Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSRJC CET-2024: All the Details

 

TSRJC CET-2024: All the Details

టీఎస్ ఆర్ జేసీ సెట్- 2024 – పూర్తి వివరాలు ఇవే

=====================

తెలంగాణ లోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 25 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఏప్రిల్ 21న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు.

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024

గ్రూపులు, సీట్లు: ఎంపీసీ - 1,496, బైపీసీ - 1,440, ఎంఈసీ - 60.

మొత్తం సీట్ల సంఖ్య: 2,996.

అర్హత: 2024 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్; బైపీసీకి ఇంగ్లిష్, బయాలజీ,

ఫిజికల్ సైన్స్; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు / ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.200.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 31-01-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16-03-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 21/04/2024.

మొదటి దశ కౌన్సెలింగ్ తేదీ: మే 2024.

=====================

NOTIFICATION

INFORMATION BULLETIN

USER MANUAL

PAYMENT

APPLY HERE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags