AP KGBV Admissions 2024-25: New
Admissions for VI, XI Classes and Leftover Vacant Seats in VII, VIII & IX
Classes
కస్తూర్భా
గాంధీ బాలికా విద్యాలయాలలో 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశము కొరకు మరియు 7, 8 & 9 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కొరకు దరఖాస్తుల వివరాలు ఇవే
=====================
ఏపీ లోని 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024-25 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలను నిర్వహిస్తున్నట్టు సమగ్ర శిక్ష పీడీ బి.
శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తున్నట్టు
పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి
ఏప్రిల్ 11 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అనాథలు, బడి బయట చిన్నారు లు, డ్రాపౌట్స్
(బడి మానేసినవారు) పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్ర్య రేఖకు
దిగువన (బీపీఎల్) జీవిస్తున్న బాలికలు మాత్రమే ప్రవేశాలకు అర్హులన్నారు. వివరాలకు
ఆర్టీఈ టోల్ ఫ్రీ నంబర్ 18004258599 సంప్రదించాల
న్నారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసే విద్యార్థిని కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ
ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40లక్ష లలోపు ఉండాలని తెలిపారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 12/03/2024
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 11/04/2024
=====================
0 Komentar