SHRESHTA 2024: All the
Details Here
శ్రేష్ఠ పథకం
ద్వారా 9,11
తరగతులలో ప్రవేశాలు - సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల పరీక్ష వివరాలు ఇవే
=====================
UPDATE
21-06-2024
SHRESHTA
2024: ఫలితాలు విడుదల
=====================
NETS: National
Entrance Test for SHRESHTA
SHRESHTA: Scheme
for Residential Education for Students in High Schools in Targeted Areas
=====================
కేంద్ర
సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్
శ్రేష్ఠ (SHRESHTA) (NETS) 2024 పథకానికి నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్ఈ (CBSE) అనుబంధ ప్రముఖ ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడం ద్వారా వారి
సామాజిక,
ఆర్ధిక అభివృద్ధికి చేయూతనందించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ
శ్రేష్ఠ విద్యా పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 3వేల సీట్లను భర్తీ చేయనున్నారు.
అర్హతలు: 2024-25 విద్యా సంవత్సరంలో ఎనిమిది, పదో తరగతి చదువుతోన్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్ పరీక్షకు అర్హులు.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలకు మించరాదు.
రాతపరీక్ష
విధానం: ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి.
మ్యాథమెటిక్స్, సైన్సు, సోషల్సైన్స్,
జనరల్ అవేర్నెస్/నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు
4 మార్కుల చొప్పున మొత్తం 400
మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే
విద్యార్థులు.. ఎన్సీఈఆర్టీ సిలబస్ లో ఎనిమిదో తరగతి సిలబస్ చదవాలి. 11వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పదో తరగతి
సిలబస్ చదవాలి.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఏపీ: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం,
అమరావతి.
తెలంగాణ: హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 12-03-2024
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 04-04-2024
అడ్మిట్ కార్డుల
విడుదల: 12-05-2024
ప్రవేశ పరీక్ష తేదీ: 24-05-2024
=====================
=====================
0 Komentar