TG - DSC 2024: All the Details
టీజీ: డీఎస్సీ 2024 – పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE 01-10-2024
జిల్లాల
వారీగా ర్యాంకింగ్ జాబితా (PDF) లు విడుదల - సర్టిఫికెట్
వెరిఫికేషన్ షెడ్యూల్ & చెక్ లిస్ట్ (ప్రోఫోర్మా) ఇదే
తెలంగాణ డీఎస్సీ లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్
వెరిఫికేషన్ మంగళవారం (అక్టోబర్ 1) ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉదయం 10 నుంచి
సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్
నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రకటించారు.
1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్
వెరిఫికేషన్ చేపట్టనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు చరవాణిలో (ఎస్ఎంఎస్)
రూపంలో సమాచారం అందించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపికైన వారి జాబితా
డీఈఓలు ప్రకటిస్తారని తెలిపారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో
ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలని స్పష్టం చేశారు.
CERTIFICATE
VERIFICATION PROFORMA – CHECK LIST
జిల్లాల
వారీగా ర్యాంకింగ్ జాబితా ఇదే 👇
====================
UPDATE 30-09-2024
TG DSC
2024: ఫలితాలు విడుదల
1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది, ఆ
తర్వాత అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తారు.
DISTRICT
WISE GENERAL RANKING LISTS - PDFS
====================
UPDATE
12-09-2024
TG DSC
2024: Edit/Update TET Details
తెలంగాణ డీఎస్సీ-2024 రాసిన వారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వివరాల లో మార్పులు ఉంటే సవరించుకోవటానికి సెప్టెంబర్ 12, 13 తేదీల్లో అవకాశం ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి
బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
====================
UPDATE 06-09-2024
TG DSC 2024: పరీక్షల తుది కీ (Final Key) విడుదల
====================
UPDATE 13-08-2024
TG DSC
2024: పరీక్షల ప్రాథమిక కీ (Initial Key) విడుదల
ప్రిలిమినరీ 'కీ'తో పాటు
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు మరియు 'కీ'పై అభ్యంతరాల
ఆప్షన్ వెబ్సైట్ లో ఉంచారు.
====================
UPDATE 11-07-2024
TG DSC 2024: హాల్ టికెట్లు విడుదల
పరీక్ష
తేదీలు: 18/07/2024 నుండి 05/08/2024 వరకు
====================
UPDATE
08-07-2024
TG DSC
2024: హాల్ టికెట్లు విడుదల తేదీ
వివరాలు ఇవే
హాల్ టికెట్లు విడుదల తేదీ: 11/07/2024 సాయంత్రం నుండి
పరీక్ష తేదీలు: 18/07/2024 నుండి 05/08/2024 వరకు
====================
UPDATE 29-06-2024
TG DSC 2024 - పరీక్షల తేదీల విడుదల
తెలంగాణ డీఎస్సీ-2024 పరీక్షల సవరించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ
పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ
పరీక్షలు జరగనున్నాయి.
గత
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని
విద్యాశాఖ ప్రకటించగా.. తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తం 13 రోజులపాటు
పరీక్షలు జరగనున్నాయి. జులై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి
పరీక్షలు ఉండవు. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, పీఈటీతో
మొదలై.. ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్(హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి.
పరీక్షల షెడ్యూల్:
జులై 18:
మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష.
జులై 18:
రెండో షిఫ్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
జులై 19:
సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 20: ఎస్జీటి, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
జులై 22:
స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
జులై 23:
సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
జులై 24: స్కూల్
అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష
జులై 26:
తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్
టీచర్ పరీక్ష
జులై 30:
స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
జులై 31:
స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయాలాజికల్
పరీక్ష
ఆగస్టు 1:
ఎస్జీటి,
స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
ఆగస్టు 2: లాంగ్వేజ్
పండిట్స్ (తెలుగు), వివిధ సబ్జెక్టుల
స్కూల్ అసిస్టెంట్ పరీక్ష
ఆగస్టు 5: స్కూల్
అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండిట్
హిందీ పరీక్ష
CLICK
FOR EXAMINATION SCHEDULE
====================
తెలంగాణ రాష్ట్రం
లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కొత్తగా నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్
అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి.
మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డీఎస్సీ
దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో
దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని
పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. గతేడాది సెప్టెంబరు
6న 5,089 పోస్టులతో జారీ
చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.
రాష్ట్రంలో
అత్యధిక ఖాళీలు హైదరాబాద్ లో 878 ఉండగా.. ఆ తర్వాత
నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 04-03-2024
దరఖాస్తు రుసుము
చెల్లింపు చివరి తేదీ: 19-06-2024
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20-06-2024
పరీక్ష
తేదిలు: 17-07-2024 నుండి 31-07-2024
వరకు
====================
NOTE: Those who
have applied in TSDSC-2023 notification need not apply
again for the same category of post
====================
FINAL-DSC-2024-DISTRICT
WISE DR VACANCY
DSC-2024
DISTRICT WISE DETAILS
====================
RERFERENCE:
Cancelled Notification Details
TS - DSC 2023: All the Details Here
====================
0 Komentar