What's Model Code
of Conduct? – Check the Terms and Conditions
మోడల్ కోడ్
ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి? ఎన్నికల కోడ్ అమల్లోకి
వచ్చాక నిబంధనలు & సూచనలు ఇవే
=====================
ఎన్నికలు
పారదర్శకంగా , నిష్పక్షపాతంగా జరిగేందుకు
ఎన్నికల కోడ్ తప్పనిసరి. అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ
సందర్భంగా ఎన్నికల సంఘం నుంచి వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు,
ఓటర్లకు నియమ, నిబంధనలుంటాయి.
ఎన్నికల కోడ్
నిబంధనలు, నియమాలు & సూచనలు ఇవే
> ప్రభుత్వ
కార్యాలయాల్లో ప్రదాని, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండకూడదు.
> ప్రభుత్వ
భవనాలు, ఆస్థుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్‌లు, హోర్డింగులు, పోస్టర్లు,
వాల్ పోస్టర్లు తొలగించాలి.
> బస్డాండ్లు,
రైల్వే స్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్థంభాలు, మున్సిపల్
కార్యాలయాల స్థలాల్లో ప్రకటనలు, హోర్డింగులు ఉండకూడదు.
> ప్రభుత్వ
అధికారిక వెబ్‌సైట్ల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధుల
ఫోటోలు తొలగించాలి.
> మంత్రుల
అధికార వాహనాల వినియోగం నిలిపివేయాలి.
> ఎన్నికల
ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది
బదిలీలపై పూర్తిగా నిషేధం ఉంటుంది.
> మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సులు ఉండవు.
> లబ్దిదారులకు
ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి, మంత్రుల
ఫోటోలు ఉండకూడదు.
> ప్రభుత్వ
అధికారులు, ఉద్యోగులు ఎన్నికల
ప్రచారంలో పాల్గొనకూడదు.
> దేవాలయం, మసీదు, ప్రార్ధనా స్థలాల్లో
ప్రచారం చేయకూడదు.
> కులాలు, వర్గాల ఆధారంగా ఓటు అడగకూడదు.
> పోలింగ్
కేంద్రానికి 100 మీటర్ల దూరంలో
ప్రచారం నిషిద్ధం.
> ఓటింగుకు
48
గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగసభలపై నిషేధం.
> ర్యాలీలు, సమావేశాల ముందస్తు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి.
> లౌడ్
స్పీకర్ వినియోగానికి అనుమతి తీసుకోవాలి.
> మీడియాలో
రాజకీయ పార్టీలు, వ్యక్తులకు
అనుకూలంగా, పక్షపాతంగా ప్రచార కథనాలపై నిషేధం
ఉంటుంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదు.
> ఓటర్లను
ప్రభావితం చేసేందుకు కుల, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు.
పుకార్లు వ్యాప్తి చేయడం నిషేధం. ఓటర్లకు డబ్బులు పంచడం, భయపెట్టడానికి వీల్లేదు.
> ఎన్నికల
షెడ్యూల్ విడుదలయ్యాక అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం నిషేధం.
> ప్రభుత్వం
కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకూడదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయకూడదు.
> ఓటర్లను
ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ, ప్రభుత్వ
అనుబంధ సంస్థలలో తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు.
> ఎన్నికల్లో
పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలోని నిధులను మంజూరు చేయకూడదు.
> ఎన్నికల
ప్రచారం కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించకూడదు. రవాణా, యంత్రాలు, భద్రతా సిబ్బందితో
సహా దేనిని ఉపయోగించకూడదు.
> ప్రభుత్వ
గెస్ట్ హౌస్‌లు, భవనాలు, ఇతర ప్రభుత్వ వసతులను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థులు
ఎన్నికల్లో తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వీలుండదు.
=====================
భారత
సార్వత్రిక ఎన్నికలు 2024: నోటిఫికేషన్ విడుదల
- ముఖ్యమైన తేదీల వివరాలు ఇవే
=====================
0 Komentar