Women’s Premier League 2024: RCB Beat
Delhi Capitals to Lift First Title for their Franchise
మహిళల
ప్రీమియర్ లీగ్ 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ను
ఓడించి RCB ఫ్రాంచైజీకి మొదటి టైటిల్‌ను అందించిన
మహిళల జట్టు
=====================
Ee Sala Cup N̶a̶m̶d̶e̶ Namdu! - ఈసారి కప్ బెంగళూరుదే
రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు ఎన్నో ఏళ్ల కల. దానిని నిజం చేస్తూ డబ్ల్యూపీఎల్ సీజన్ - 2 కప్ గెలిచింది. దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో
ఆర్సీబీ 8
వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన
దిల్లీని 113కి బెంగళూరు ఆలౌట్ చేసింది. ఆపై
లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
స్మృతి మంధాన (31), సోఫీ డివైన్ (32), ఎలీస్ పెర్రీ (35*), రిచా ఘోష్ (17 ) రాణించారు.
తొలుత
దిల్లీని 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండు
వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (31), సోఫీ డివైన్ (32) తొలివికెట్కు 49 పరుగుల మంచి
శుభారంభం అందించారు. అనంతరం రిచా ఘోష్ (17) సహకారంతో ఎలీస్ పెర్రీ (35*) మ్యాచు విజయతీరాలకు
చేర్చింది. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి దిల్లీ పతనాన్ని శాసించిన సోఫీ
మోలినక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది.
తొలుత టాస్
నెగ్గి బ్యాటింగ్కు దిగిన దిల్లీ జట్టుకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు.
ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టును.. కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి
చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులకే
కుప్పకూలింది. ఓపెనర్లు షెఫాలి వర్మ (44), మెగ్ లానింగ్ (23) మినహా మిగతావారు
విఫలమయ్యారు. తొలి వికెట్ కు 64 పరుగుల జోడించిన
ఢిల్లీ ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.
=====================
𝙏𝙝𝙖𝙩 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙈𝙤𝙢𝙚𝙣𝙩! 👏 👏
— Women's Premier League (WPL) (@wplt20) March 17, 2024
That's how the Royal Challengers Bangalore sealed a memorable win to emerge the #TATAWPL 2024 Champions! 🏆
Scorecard ▶️https://t.co/g011cfzcFp#DCvRCB | #Final | @RCBTweets pic.twitter.com/ghlo7YVvwW
0 Komentar