World Happiness Report-2024: Finland
Tops For 7th Straight Year, Check India's Rank Here
వరల్డ్
హ్యాపీనెస్ రిపోర్ట్-2024: ఆనందకర దేశాల్లో
వరుసగా 7వ సారి ఫిన్‌లాండ్ నెం.1, భారత్ ర్యాంక్ ఇదే
======================
ప్రపంచంలోనే
అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
మార్చి 20న ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. దీన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమతి (UN) గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా 2024 ఏడాదికి నివేదికను విడుదల చేసింది.
మొత్తం 143 దేశాల్లోని డేటాను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను సిద్ధం
చేసింది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. గతేడాది
125వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది ఒక స్థానం కిందకు దిగజారింది.
పొరుగు దేశాలైన చైనా (60), నేపాల్ (93), పాకిస్థాన్ (108) భారత్
కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. తాలిబాన్ ల పాలన లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితా లో
అట్టడగు స్థానం (143) లో ఉంది.
మళ్ళీ నెం.1
ఫిన్లాండ్
ఈ జాబితాలో
ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది ఏడో సారి కావడం విశేషం. ఆ తర్వాతి
స్థానాల్లో డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. అగ్ర
రాజ్యం అమెరికా 23వ స్థానంలో
నిలిచింది.
ప్రపంచంలోని
మొదటి 25 సంతోషకరమైన దేశాలు ఇవే:
1. ఫిన్లాండ్
2. డెన్మార్క్
3. ఐస్లాండ్
4. స్వీడన్
5. ఇజ్రాయెల్
6. నెదర్లాండ్స్
7. నార్వే
8. లక్సెంబర్గ్
9. స్విట్జర్లాండ్
10. ఆస్ట్రేలియా
11. న్యూజిలాండ్
12. కోస్టా రికా
13. కువైట్
14. ఆస్ట్రియా
15. కెనడా
16. బెల్జియం
17. ఐర్లాండ్
18. చెకియా
19. లిథువేనియా
20. యునైటెడ్ కింగ్‌డమ్
21. స్లోవేనియా
22. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
23. యునైటెడ్ స్టేట్స్
24. జర్మనీ
25. మెక్సికో
======================
======================
0 Komentar