Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

First DD Telugu News Reader Santhi Swaroop is No More

 

First DD Telugu News Reader Santhi Swaroop is No More

దూరదర్శన్-తెలుగు ప్రముఖ న్యూస్ రీడర్ & తొలి తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ ఇకలేరు

=======================

దూరదర్శన్ సప్తగిరి (తెలుగు భాషలో) తొలి టీవి ఛానల్. ఇది 1977 సంవత్సరంలో అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిచే ప్రారంభింఛబడింది. 

శాంతిస్వరూప్ గారు 1978లో ఆయన దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు. 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ఆయనకే అవకాశం దక్కింది. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి... ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు.

> 1977లో ప్రారంభమైన దూరదర్శన్ సప్తగిరి

> 1978లో ఉద్యోగిగా చేరిన శాంతి స్వరూప్

> 1983 నవంబరు 14న తొలి బులిటెన్ విడుదల

తొలి తెలుగు యాంకర్, న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే.. వార్తలు, సమాచారం, ‘జాబులు- జవాబులు’, ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్.. ప్రస్తుత తరం యాంకర్లకు ఆయనే గురువు అంటే అతిశయోక్తి కాదు.


 

పదేళ్లపాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి చెప్పేవారు. 1983 నవంబర్ 14 నుంచి దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవీ విరమణ చేసేవరకు దూరదర్శన్ లో పనిచేశారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags