Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCET 2024: Integrated Teacher Education Programme (ITEP) – Details Here

 

NCET 2024: Integrated Teacher Education Programme (ITEP) – Details Here

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 - ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే

=====================

ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్ 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) 2024 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐటీఈపీ ప్రోగ్రామ్ లో అడ్మిషన్లు పొందవచ్చు.

కోర్సు వివరాలు:

అర్హత: ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయోపరిమితి: అభ్యర్థులకు వయోపరిమితి లేదు.

సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 వివిధ వర్సిటీలు / ఆర్ఎస్ఐఈ / ఎన్ఎస్ఐటీలు, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ సంస్థల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లిష్, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650.

తెలుగు రాష్ట్రాలలోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13-04-2024

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-04-2024, 15-05-2024

=====================

REGISTER

SIGN-IN

INFORMATION BULLETIN

PRESS NOTE ON APPLICATION DATES

SYLLABUS

PUBLIC NOTICE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags