SSC Recruitment
2024: Apply for 968 Junior Executive Posts – Details Here
కేంద్ర
ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజినీర్
ఉద్యోగాలు - జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400
=====================
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్
బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో
ఇంజినీరింగ్ చదివినవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ
నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా
ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్
ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్
ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024
మొత్తం
పోస్టుల సంఖ్య: 968.
అర్హతలు:
డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/
మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.
గరిష్ఠ
వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు
మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి.
జీత భత్యాలు:
సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400 - రూ.1,12,400 ఉంటుంది.
ఎంపిక
విధానం: పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
దరఖాస్తు
ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్
మెన్లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 28-03-2024
ఆన్లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: 18-04-2024
ఆన్లైన్ ఫీజు
చెల్లింపు చివరి తేదీ: 19-04-2024.
కంప్యూటర్
ఆధారిత పరీక్ష (పేపర్-1): 04-06-2024 నుంచి 06-06-2024 వరకు.
ఎలా దరఖాస్తు
చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.
=====================
=====================
0 Komentar