HDFC Bank: New Complete Digital Pixel
Play Credit Card – Details Here
హెచ్‌డిఎఫ్‌సి
బ్యాంక్: నూతన డిజిటల్
పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డ్ – కార్డు కస్టమైజ్ వివరాలు, జాయినింగ్ ఫీజు & రివార్డులు వివరాలు
ఇవే
=========================
ఒక కేటగిరీకి చెందిన కార్డు తీసుకుంటే.. మిగిలిన వాటిపై
రివార్డు పాయింట్ల రూపంలో వచ్చే ప్రయోజనాలు కోల్పోయినట్లే. కేటగిరీ ప్రయోజనాలూ
అందుకోవాలంటే మరో క్రెడిట్ కార్డు తీసుకోవాల్సిందే. ఇలాంటి వారి కోసమే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పిక్సెల్ ప్లే (HDFC Bank Pixel
Play) క్రెడిట్ కార్డును ఇటీవల
తీసుకొచ్చింది. ఇందులో రివార్డు ప్రోగ్రామ్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆయా
కొనుగోళ్లపై 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది.
ఈ కార్డును ఎలా కస్టమైజ్ చేసుకోవాలి? జాయినింగ్ ఫీజు ఎంత?
మనలో చాలా మంది పండగలు రాగానే దుస్తులు కొనుగోలు
చేస్తుంటారు. మిగిలిన సీజన్స్లో డైనింగ్, ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యం
ఇస్తుంటారు. కొందరైతే ఏడాది పొడవునా ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు
చేస్తుంటారు. అలాగని ప్రతి సీజన్ కు తగ్గట్టు ఆ కేటగిరీకి చెందిన క్రెడిట్
కార్డును తీసుకోవడం సాధ్యపడదు. దీనికి హెచ్‌డిఎఫ్‌సి పిక్సెల్ ప్లే పరిష్కారం
చూపుతుంది. ఐదు రకాల కేటగిరీల్లో ఏదేని రెండింటిని యూజర్లు ఎంచుకోవచ్చు. వాటిపై 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆయా కేటగిరీలను
మార్చుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. హెచ్‌డిఎఫ్‌సి చెందిన పేజ్ యాప్ లో మార్పులు
చేసుకోవచ్చు.
కేటగిరీలు:
1. డైనింగ్, ఎంటర్టైన్మెంట్ - బుక్ మై షో, జొమాటో
2. ట్రావెల్- మేక్ మై ట్రిప్, ఉబర్
3. గ్రాసరీ - బ్లింకిట్, రిలయన్స్
స్మార్ట్ బజార్
4. ఎలక్ట్రానిక్స్- క్రోమా, రిలయన్స్
డిజిటల్
5. ఫ్యాషన్ - నైకా, మింత్రా
వీటిలో ఏ రెండు కేటగిరీలను ఎంచుకున్నా. ఆ కేటగిరీలోని
ఆన్లైన్/ ఆఫ్లైన్ వేదికలపై కొనుగోళ్లపై 5 శాతం లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీకు నచ్చిన దాన్ని ఎంచుకుంటే 3 శాతం
క్యాష్బ్యాక్ వస్తుంది. ఇతర కొనుగోళ్లపై 1 శాతం
క్యాష్బ్యాక్ లభిస్తుంది.
దరఖాస్తు విధానం:
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేజ్ యాప్ (payZapp) దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్ ప్లే యాప్ స్టోర్
నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పిక్సల్ ప్లే క్రెడిట్ కార్డు బ్యానర్ పై క్లిక్
చేయాలి. పూర్తిగా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియ ఉంటుంది. నెలకు రూ.25 వేలు కంటే ఎక్కువ ఆర్జిస్తున్న ఉద్యోగులకు, రూ.6 లక్షల వార్షిక వేతనం కలిగిన స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఈ కార్డును జారీ
చేస్తారు. పేజ్ యాప్ వర్చువల్ గా పేమెంట్లు చేయడంతో పాటు, ఆఫ్లైన్ లో ఫిజికల్
కార్డును వినియోగించుకోవచ్చు.
జాయినింగ్ ఫీజు & రివార్డులు:
ఈ కార్డు పొందాలంటే జాయినింగ్ ఫీజు రూ.500 చెల్లించాలి. కార్డు తీసుకున్న 90 రోజుల్లో రూ.20 వేలు ఖర్చు చేస్తే ఫీజు రద్దవుతుంది. ఒక ఏడాదిలో రూ.1 లక్ష కంటే
ఎక్కువ ఖర్చు చేస్తే రెన్యువల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రివార్డుల రూపంలో
వచ్చిన క్యాష్ పాయింట్లు పేజ్ యాప్ వాలెట్లో జమ అవుతుంది. యాప్లోనే రిడీమ్
చేసుకోవచ్చు.
చివరిగా: వివిధ కేటగిరీల వారీగా రివార్డు ప్రయోజనాలు
అందుకోవాలనుకునే వారికి ఈ కార్డు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఇందులో
లేదు. పైగా కేటగిరీల్లో ఎంపిక చేసిన వేదికలపై మాత్రమే రివార్డు ప్రయోజనాలు
లభిస్తాయి.
=========================
గమనిక: మీ నైపుణ్యంతో క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే అది ఉపయోగకరం.
=========================
The Credit Card revolution is here. The PIXEL range of end-to-end Digital Credit Cards- For The Born Digital.
— HDFC Bank (@HDFC_Bank) May 15, 2024
To know more visit the link below,https://t.co/cTJXUHxqcT#HDFCBank #BornDigital #Digital #PixelCreditCard #Pixel #CreditCard #NewLaunch pic.twitter.com/RSxHxGSCO9
0 Komentar