Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL 2024: KKR Wins Third Title After 10 Years – Completely Dominant KKR in the 2024 Season

 

IPL 2024: KKR Wins Third Title After 10 Years – Completely Dominant KKR in the 2024 Season

ఐపీఎల్‌-2024: పది ఏళ్ల తర్వాత మూడో టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్  – 2024 సీజన్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన  కోల్‌కతా నైట్ రైడర్స్

======================

ఆదివారం చెన్నై లో జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట మిచెల్ స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24), ఆండ్రి రసెల్ (3/19)ల అద్భుత బౌలింగ్ కి  సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. 24 పరుగులు చేసిన కెప్టెన్ కమిన్సే టాప్ స్కోరర్. అనంతరం వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్; 26 బంతుల్లో 4x4, 3x6), రహ్మనుల్లా గుర్బాజ్ (39; 32 బంతుల్లో 5x4, 2x6) చెలరేగడంతో లక్ష్యాన్ని నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. మిచెల్ స్టార్క్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు. 2012, 2014లోనూ విజేతగా నిలిచిన కోల్కతా. పదేళ్ల తర్వాత మళ్లీ కప్పు అందుకుంది.



IPL 2024 అవార్డులు

విజేత (రూ. 20 కోట్లు) - కోల్‌కతా నైట్ రైడర్స్

రన్నరప్ (రూ. 12.5 కోట్లు) - సన్‌రైజర్స్ హైదరాబాద్

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ (రూ. 10 లక్షలు) - నితీష్ కుమార్ రెడ్డి (SRH)

అల్టిమేట్ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ (రూ. 10 లక్షలు) - సునీల్ నరైన్ (KKR)

అత్యంత విలువైన ఆటగాడు (రూ. 10 లక్షలు) - సునీల్ నరైన్ (KKR)

ఆరెంజ్ క్యాప్ (రూ. 10 లక్షలు) - విరాట్ కోహ్లీ (RCB)

పర్పుల్ క్యాప్ (రూ. 10 లక్షలు) - హర్షల్ పటేల్ (PBKS)

అత్యధిక సిక్స్‌ల అవార్డు (రూ. 10 లక్షలు) - అభిషేక్ శర్మ (SRH)

అత్యధిక ఫోర్లు అవార్డు (రూ. 10 లక్షలు) - ట్రావిస్ హెడ్ (SRH)

బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు (రూ. 10 లక్షలు) - జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (DC)

క్యాచ్ ఆఫ్ ది సీజన్ (రూ. 10 లక్షలు) - రమణదీప్ సింగ్ (KKR)

ఫెయిర్ ప్లే అవార్డు (రూ. 10 లక్షలు) - సన్‌రైజర్స్ హైదరాబాద్

పిచ్ మరియు గ్రౌండ్ అవార్డు (రూ. 50 లక్షలు) - రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్

IPL ఫైనల్ - KKR vs SRH అవార్డ్స్

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - మిచెల్ స్టార్క్

ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ - మిచెల్ స్టార్క్

మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు - వెంకటేష్ అయ్యర్

మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు - రహ్మానుల్లా గుర్బాజ్

మ్యాచ్‌లో అత్యధిక డాట్ బాల్స్ - హర్షిత్ రానా


ఇప్పటిదాకా జరిగిన 17 సీజన్ లలో విజేత ల వివరాలు ఇవే

1. ముంబై ఇండియన్స్ – 5

2. చెన్నై సూపర్ కింగ్స్ – 5

3. కోల్‌కతా నైట్ రైడర్స్ – 3

4. రాజస్థాన్ రాయల్స్ – 1

5. డెక్కన్ ఛార్జర్స్ – 1

6. సన్‌రైజర్స్ హైదరాబాద్ – 1

7. గుజరాత్ టైటాన్స్ – 1

======================

CLICK FOR AWARDS CEREMONY

CLICK FOR MATCH HIGHLIGHTS

CLICK FOR SCORE CARD

JIO CINEMA APP

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags