Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JioCinema New Premium Annual Plan with 50% Less Price – Details Here

 

JioCinema New Premium Annual Plan with 50% Less Price – Details Here

జియో సినిమా తక్కువ ధర తో ప్రీమియం నూతన వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ – పూర్తి వివరాలు ఇవే

======================

జియో సినిమా ప్రీమియం కొత్త వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకు వచ్చింది. నెలవారీ  ప్లాన్ తో పాటు తాజాగా వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను అందుబాటు ధరలో ప్రవేశపెట్టింది. ఈ సబ్స్క్రిప్షన్ కింద ఎలాంటి ప్రకటనలూ లేకుండా 4కె రిజల్యూషన్ తో స్ట్రీమింగ్ వీడియోలను చూడొచ్చు.

వార్షిక ప్లాన్ ధర రూ.599, ప్రారంభ ఆఫర్ కింద వార్షిక సబ్స్క్రిప్షన్ ధరపై 50శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే కేవలం రూ.299కే ప్లాన్ లభించనుంది. మొదటి 12 నెలల బిల్లింగ్ సైకిల్ ముగిశాక సబ్స్క్రిప్షన్ కావాలంటే పూర్తి మొత్తంలో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా ఒక డివైజ్ లో  ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్ ను వీక్షించొచ్చు. అదీ 4కే వీడియో క్వాలిటీతో. డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లోనూ కంటెంట్ ను ఎంజాయ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నమెంట్, ఇతర క్రీడలు, ప్రత్యక్ష ప్రసార ఈవెంట్లు మాత్రం యాడ్స్ మునుపటి వార్షిక ప్లాన్ రూ.999తో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఇటీవల జియో రూ.29, రూ.89తో (ఫ్యామిలీ ప్యాక్) రెండు కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి నెలవారీ ప్లాన్లు. సినిమాలు, హాలీవుడ్ బ్లాక్బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్టైన్మెంట్ ను స్మార్ట్ టీవీ సహా ఏ డివైజ్లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీసుకొచ్చిన వార్షిక ప్లాన్లోనూ ఈ తరహా సదుపాయాలే ఉన్నాయి. జియో గత నెలలో ప్రీమియం ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలను రూ.149 నుంచి రూ.89కి తగ్గించింది. ఈ ప్లాన్ లో ఒకేసారి నాలుగు డివైజుల్లో కంటెంట్ ను వీక్షించొచ్చు.

======================

MOBILE APP

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags