TVS Motor Launches new TVS iQube e-Scooter
with Price Starting from Rs 94,999 – Details Here
టీవీఎస్ ఐక్యూబ్
మోడల్ నుండి రెండు కొత్త కొత్త వేరియంట్లు – ధర రూ. 94,999 నుండి ప్రారంభం – ఫీచర్ల
వివరాలు ఇవే
=======================
టీవీఎస్ తమ
విద్యుత్తు స్కూటర్ ఐక్యూబ్ మోడల్ లో మరో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది.
దీంతో ఈ స్కూటర్ (TVS iQube) ఇప్పుడు మొత్తం ఐదు
వేరియంట్లు, 11 రంగుల్లో లభిస్తోంది.
కొత్తగా వచ్చిన
రెండు వేరియంట్లలో ఐక్యూబ్ (TVS iQube) బేస్
వేరియంట్ ఒకటి. దీని ధర రూ.94,999 (ఎక్స్ప్లోరూం). 2.2kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 75 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. రెండు గంటల్లో దీని
బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఐదు అంగుళాల టీఎఫీ డిస్ప్లే, నావిగేషన్, థెఫ్ట్ అలర్ట్ వంటి
ఫీచర్లు ఉన్నాయి. సీటు కింద 30 లీటర్ల స్టోరేజ్
ఉంటుంది.
మరోవైపు
టీవీఎస్ ఐక్యూబ్ ఎన్టీలో (TVS iQube ST) 3.4kWh బ్యాటరీ ప్యాక్ తో మరో కొత్త వేరియంట్ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.56 లక్షలు (ఎక్సోషోరూం). దీని రేంజ్ 100 కిలోమీటర్లు. బ్యాటరీని 2:50 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు.
దీంట్లోనూ 7 అంగుళాల టీఎల్డీ డిస్ప్లే ఉంది.
బ్లూటూత్,
అలెక్సా వాయిస్ అసిస్ట్, డిజిటల్
డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి ఫీచర్లూ ఉన్నాయి. మరోవైపు ఎన్టీలోనే 5.1kWh వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.1.85 లక్షలు (ఎక్సో రూం). దీని రేంజ్ 150 కిలోమీటర్లు. గరిష్ఠంగా గంటకు 82 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని బ్యాటరీ 4:18 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఎన్టీ వేరియంట్లను జులై
15కు ముందు బుక్ చేసుకున్న వారికి లాయల్టీ బోనస్ కింద రూ.10,000 రాయితీ లభిస్తుంది.
తాజాగా
తీసుకొచ్చిన రెండు కొత్త వేరియంట్లతో కలిపి ఈ స్కూటర్ ఇప్పుడు ఐక్యూబ్ (2.2 kWh), ఐక్యూబ్ (3.4 kWh), ఐక్యూబ్ ఎస్
(3.4
kWh), ఐక్యూబ్ ఎస్టా (3.4 kWh), ఐక్యూబ్ ఎస్టా (5.1 kwh).. మొత్తం ఐదు
వేరియంట్లలో లభిస్తోంది.
=======================
=======================
0 Komentar